మారుతున్న జీవనశైలితో మన ఆయుర్దాయం తగ్గిపోతోంది అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ ఆరోగ్యంగా మారాలని చూస్తున్నారు. అయితే ఏం తింటున్నాం అనేది ఎంత ముఖ్యమో.. ఎలా తింటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం.
ఉరుకుల పరుగుల జీవితం, ఇంట్లో భార్యాభర్తలు పనిచేస్తే కానీ, కుటుంబం గడవని పరిస్థితి. అంతేకాకుండా మారుతున్న జీవనశైలితో మనం ఏం తింటున్నాం? ఎలా తింటున్నాం? మనం తినే ఆహారంతో ఆరోగ్యంగా ఉంటామా? అనే ఆలోచనే లేకుండా ఉంటున్నాం. ఆకలైనప్పుడు అంత తినేసి చేతులు కడుక్కుంటున్నాం. అందుకే ఇప్పుడు మనిషి సగటు జీవితకాలం తగ్గిపోతోంది. ప్రస్తుతం వంద నుంచి 70 ఏళ్లకు తగ్గిపోయింది. రాబోయే తరాల్లో ఇది మరింత తగ్గుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు వయసుతో సంబంధం లేకుండా ముందుగానే వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తున్నాయి. శరీరం కూడా రానురాను పట్టు కోల్పోతోంది. ఇందుకు చాలానే కారణాలు చెబుతారు.
అయితే మీరు ఎప్పుడన్నా మన తాత, ముత్తాలు ఎంతకాలం బతికారు? వారి జీవనశైలి ఏంటి, వారు ఏం తిన్నారు? ఎలా తిన్నారు? వాళ్లు అంత దృఢంగా ఉండటం వెనుక ఉన్న రహస్యం ఏంటని ఆలోచించారా? వాళ్లు ఏం తిన్నారు అనేది ఎంత ముఖ్యమో.. ఎలా తిన్నారు అనేది కూడా ముఖ్యమే. గతంలో వంట అంతా ఇత్తడి, కంచు, రాగి, మట్టి పాత్రల్లో చేసుకునే వారు. అలా చేయడం వల్ల ఆహారంలో ఉండే పోషకాలు మొత్తం శరీరానికి అందేవి. ఇప్పుడు వాడుతున్న పాత్రల కారణంగా ఆ పోషకాలను చాలా కోల్పోతున్నాం. అందుకే పవిత్ర ఆర్గానిక్స్ వాళ్లు అలనాటి జీవన విధానాన్ని మరోసారి ప్రజలకు పరిచయం చేయాలి, తిరిగి ప్రజలు ఆరోగ్యంగా మారాలి అనే సదుద్దేశంతో ఇత్తడి, కంచు పాత్రలను తక్కువ ధరలకే అందిస్తున్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ కిందనే ఉన్న వీడియోలో చూడండి.