Abdul Sattar Success Story: జీవితం అందరికీ ఒకే రకమైన అనుభవాలను ఇవ్వదు. జీవితం ఇచ్చిన అనుభవాలతో పాఠాలు నేర్చుకుంటే అనుకున్నది సాధిస్తాం.. ఎంత నేర్చుకుంటే అంత ముందుకు వెళతాం. అర్జునుడికి చెట్టు మీద ఉన్న పిట్ట కన్ను మాత్రమే కనపడ్డట్టు.. మనకు మన లక్ష్యం మాత్రమే కనిపించాలి. అప్పుడు విజయం మరింత తొందరగా మనల్ని చేరుతుంది. ఈ సిద్ధాంతాలతోటే ఓ డెలివరీ బాయ్ తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఎంతో కష్టపడి సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా మారాడు. అంచెలంచెలుగా జీవితంలో ఎదుగుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నానికి చెందిన షేక్ అబ్దుల్ సత్తార్‌ది దిగువ మధ్య తరగతి కుటుంబం. తండ్రి ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి.
సత్తార్ కుటుంబం రోజూ వారి అవసరాలు తీర్చుకోవటానికి ఎంతో కష్టపడాల్పి వచ్చేది. అందుకే కాలేజీ చదువుతూనే మరోవైపు డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడు సత్తార్. స్విగ్గీ, జొమాటోలతో పాటు ఊబర్, ఓలా, రాపిడో వంటి వాటిలో కూడా పని చేశాడు. సాయంత్రం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు 18 గంటలు పని చేసేవాడు. ఈ నేపథ్యంలో ఓ ఫ్రెండ్ ఇచ్చిన సలహా అతడి జీవితాన్నే మార్చేసింది. ఫ్రెండ్ చెప్పిన విధంగా కోడింగ్ నేర్చుకుని సాఫ్ట్‌వేర్‌లో అడుగుపెట్టాడు. ప్రోబ్ ఇన్‌ఫర్‌మేషన్ కంపెనీలో చేరాడు.
అంతటితో ఆగకుండా వెబ్ అప్లికేషన్లను కూడా తయారుచేసే పనిలో పడ్డాడు. తన జీవితానికి సంబంధించిన విజయ గాథను మే 27, 2022లో లింక్‌డ్‌ఇన్‌లో పోస్ట్ ద్వారా తెలియజేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడి విజయ గాథను లింక్‌డ్‌ఇన్ సైతం ప్రశంసించింది. నెటిజన్లు అబ్దుల్ సత్తార్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరి, అబ్ధుల్ సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Viral Video: టర్నింగ్ లో పెను ప్రమాదం.. ప్రాణాలతో భయటపడ్డ జనాలు! వీడియో వైరల్!