డెలివరీ పర్సన్స్ కష్టాలను చూసిన ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. వారి కోసం రిలాక్స్ స్టేషన్ ను ఏర్పాటు చేసి గొప్పమనసు చాటుకున్నాడు. దీంతో డెలివరీ పర్సన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యువకుడి పనికి అందరు ప్రశంసిస్తున్నారు.
స్విగ్గీ, జొమాటోలతో పాటు ఇతర ఆన్ లైన్ ఫుడ్ డెలీవరీ సంస్థలు అందుబాటులోకి వచ్చాక జనాలకు ఉన్నచోటుకే ఫుడ్ తెప్పింకునే వెసులుబాటు కలిగింది. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో సమయం సరిపోక ఎక్కువగా ఆన్ లైన్ ఫుడ్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదంతా ఒక పక్క అయితే ఫుడ్ డెలివరీలో కీలకంగా వ్యవహరిస్తున్న వారు డెలివరీ పర్సన్స్. ఉపాధి మార్గంగా ఫుడ్ డెలివరీ సంస్థల్లో డెలివరీ పర్సన్స్ గా చేరి ఉపాధి పొందుతు కుటుంబాలను పోషింకుంటున్నారు. కాగా ఎండనకా, వాననక, రాత్రనక, పగలనక సమయానికి సరిగా తినక ఎంతో కష్టపడుతుంటారు డెలివరీ పర్సన్స్. వీరి కష్టాన్ని చూసిన ఓ యువకుడు వారి కోసం రిలాక్స్ స్టేషన్ ను ఏర్పాటు చేశాడు. వారికోసం ఉచితంగా టీ, స్నాక్స్, అందిస్తూ మంచి మనసు చాటుకుంటున్నాడు. మరి ఇది ఎక్కడ ఏర్పాటు చేశారో ఆ వివారాలు మీకోసం..
ఈ వర్షాకాల సీజనల్ లో ఆహ్లాదకరమైన వాతావరణంలో వేడి వేడిగా టీలు, స్పైసీ పుడ్ తినాలనే కోరిక కలుగుతుంది. ప్రజలు వెంటనే ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల ద్వారా ఆర్డర్ పెట్టుకుని తమ ఆకలిని తీర్చకుంటారు. కానీ అందరికీ జీవితం ఒకేలా ఉండదు కదా. కస్టమర్లకు సమయానికి వారు పెట్టుకున్న ఆర్డర్లను పంపిణీ చేసే డెలివరీ పర్సన్స్ వారికి ఎంత అసౌకర్యంగా ఉన్నా సమయానికి ఫుడ్ డెలివరీ చేస్తారు. కస్టమర్లకు సమయానికి ఫుడ్ డెలివరీ చేస్తూ విశ్రాంతి లేకుండా పని చేస్తున్న డెలివరీ పర్సన్స్ కోసం ఓ యువకుడు వారికి కాస్త రిఫ్రెష్ మెంట్ ఇచ్చేందుకు ముంబైలో రిలాక్స్ స్టేషన్ ను ఏర్పాటు చేశాడు. ముంబైకి చెందిన సిద్దేష్ లోకారె అనే యువకుడు డెలివరీ పర్సన్స్ కోసం ఉచితంగా టీ, స్నాక్స్, రెయిన్ కోట్స్ అందిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఆ వీడియోలో తను ఏర్పాటు చేసిన రిలాక్స్ స్టేషన్ కి డెలివరీ బాయ్స్ ను ఆహ్వానించి వారికి ఫ్రీగా స్నాక్స్ అందిస్తున్న దృష్యాలను మనం చూడవచ్చు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ సిద్దేష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.