మానవుల్లో పురుషులు, స్త్రీలే కాకుండా ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. వీరిని దేవతా స్వరూపులుగా భావిస్తారు. వాస్తవానికి మిగిలినవారితో పోలిస్తే వీరి పట్ల వివక్షత ఎక్కువ. వీరిని అస్సలు మనుషుల్లాగానే చూడరు. ఇక వీరిని పనుల్లో పెట్టుకునేందుకు వెనకాడుతుంటారు.
మానవ జాతుల్లో పురుషులు, స్త్రీలే కాకుండా ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. వీరిని దేవతా స్వరూపులుగా భావిస్తారు. వాస్తవానికి మిగిలినవారితో పోలిస్తే వీరి పట్ల వివక్షత ఎక్కువ. వీరిని అస్సలు మనుషుల్లాగానే చూడరు. ఇక వీరిని పనుల్లో పెట్టుకునేందుకు వెనకాడుతుంటారు. దీంతో బతుకు దెరువు కోసం రోడ్డు సిగ్నల్స్, మార్కెట్, వీధుల్లో, రైళ్లల్లో అడుక్కుని జీవనం సాగిస్తుంటారు. అలాగే కొన్ని సార్లు ట్రాన్స్ జెండర్లు డబ్బుల కోసం ఇబ్బందులకు గురి చేసిన దాఖలాలు ఉన్నాయి. కొత్త షాపులు, ఇళ్లు ఏవైనా ఉన్నాయంటే.. వారు అడిగినంత ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుంటారు. అలాగే శాపనార్థాలు పెడతామని బెదిరిస్తారు. దాడి చేసిన ఘటనలు కూడా చూశాం. ఇప్పుడు ఈ ట్రాన్స్ జెండర్లు కొత్త దందా మొదలు పెట్టారు.
కర్ణాటకలోని బెంగళూరులో తెల్లవారు జామున 5 గంటలకు ఒంటరిగా ఆటోలో వెళుతున్నారా.. అయితే జాగ్రత్త. ఎందుకంటే దోపిడీ దొంగలు దోచుకుంటున్నారు. ఆ దోపిడీకి పాల్పడుతుంది మరెవ్వరో కాదూ ట్రాన్స్ జెండర్స్. కొంత మంది ట్రాన్స్ జెండర్లు ఓ ముఠాగా ఏర్పడి.. తెల్లవారు జామున దొంగతనాలకు పాల్పడుతున్నారు. బస్టాపులు, వీధిలో వాకింగ్ చేసేవారు, ఉదయం 5 గంటల్లోపు ఆటోలో ప్రయాణిస్తున్న వారిని దోచుకుంటున్నారు. వీరికి ఓ ఆటో డ్రైవర్ కూడా సహకరిస్తున్నాడు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి ప్లాన్ చేస్తున్నారు. ఉదయం పూట విధులకు వెళ్లే సాఫ్ట్ వేర్ లేదా రోడ్డుపై వెళ్లేవారిని టార్గెట్ చేస్తున్నారు. డబ్బులు అడిగినట్లు దగ్గరకు వచ్చి.. పర్సులు తీయగానే.. వ్యాలెట్ తీసుకుని పరుగులు పెడుతున్నారు.
అంతే కాదూ.. ఉదయం 5 గంటలకు ఎవరైనా ఒంటరిగా ఆటో ఎక్కితే చాలు.. ముఠా అంతా ఆ ఆటోను చుట్టి మొత్తం దోచుకెళుతున్నారు. తెల్లవారు జామున 5 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు ఇటువంటి చర్యలకు దిగుతున్నారు. ఇలా దారి దోపిడీలకు ట్రాన్స్ జెండర్లు పాల్పడుతుండటంతో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన కొడిగేహళ్లి పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు ట్రాన్స్ జెండర్లు కాగా, ఒకరు ఆటో డ్రైవర్. అరెస్టైన వారిని స్నేహ, ఆవిష్క, దీపిక, ప్రకాష్ లుగా గుర్తించారు. వివిధ స్టేషన్లలో వీరిపై పలు కేసులున్నాయి.