ఆవేశం అనర్థాలకు దారి తీస్తుంది. స్థిమితంగా ఆలోచన చేయాల్సిన సమయంలో కోపంతో రగిలిపోయి క్షణికంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. కుటుంబం అన్నాక సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిని అధిగమించితే.. ఆ ఇల్లు స్వర్గాన్ని తలపిస్తుంది.
ఆవేశం అనర్థాలకు దారి తీస్తుంది. స్థిమితంగా ఆలోచన చేయాల్సిన సమయంలో కోపంతో రగిలిపోయి క్షణికంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. కుటుంబం అన్నాక సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిని అధిగమించితే.. ఆ ఇల్లు స్వర్గాన్ని తలపిస్తుంది. భార్య భర్తల మధ్య గొడవలు, ఇతర ఆర్థికపరమైన సమస్యలు చుట్టుముట్టినప్పుడు.. ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుంటే కచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది. కాదని తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే కుటుంబం మొత్తం సర్వనాశనమౌతుంది. ఏం అయ్యిందో తెలియదు కానీ భార్యను, బిడ్డలను అత్యంత కిరాతకంగా చంపేసి, ఆత్మహత్య చేసుకున్నాడు తెలుగు టెకీ. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలను గుర్తించారుపోలీసులు.
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వీరాంజనేయ విజయ్(31), భార్య హేమావతి (29) భార్యాభర్తలు. విజయ్ బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అతడి కుటుంబం కొన్నాళ్ల క్రితం ఆంధ్రా నుండి వచ్చేసింది. విజయ్ ఆరు సంవత్సరాల క్రితం హేమావతిని వివాహం చేసుకున్నాడు. వీరికి మోక్ష మేఘనయన (2), శృతి సునయన (8నెలలు) పిల్లలున్నారు. కుండలహళ్లిలోని ఒక సాఫ్ట్‌వేర్ సంస్థలో టీమ్ లీడ్‌గా పనిచేస్తున్నాడు. అతని కుటుంబం సీగేహళ్లిలోని సాయి గార్డెన్ అపార్ట్‌మెంట్‌లోని గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్‌లో నివాసముంటోంది. కాగా, హైదరాబాద్ లో ఉంటున్న విజయ్ సోదరుడు శేషసాయి మంగళవారం నుండి ఫోన్లు చేస్తుండగా.. భార్యా భర్తలిద్దరీ మొబైల్స్ స్విచ్ఛాఫ్ అని వస్తుంది. రెండు రోజుల నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో విజయ్ సోదరుడు గురువారం బెంగళూరుకు వచ్చి.. వారు ఉంటున్న నివాసానికి వెళ్లాడు.
లోపల నుండి ఫ్లాట్ కు తాళం వేయడాన్ని గమనించిన శేషసాయి.. పలుమార్లు తలుపుకొట్టిన రెస్పాన్స్ రాకపోవడంతో చుట్టుప్రక్కల వారికి సమాచారం అందించాడు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. తలుపులు బద్దలు కొట్టి చూడగా.. ఇల్లంతా దుర్వాసన వస్తుంది. బెడ్ రూమ్ లో చూడగా.. బెడ్ పై ముగ్గురు పడి ఉండగా.. విజయ్ ఫ్యానుకు వేలాడుతూ కనిపించారు. మృతదేహాలన్నీ కుళ్లిన స్థితిలో కనిపించాయి. కొన్ని ఆనవాళ్ల ద్వారా భార్యా, పిల్లలు చనిపోయి రెండు, మూడు రోజులు అయ్యి ఉంటుందని కాడుగోడి పోలీసులు భావిస్తున్నారు. విజయ్ భార్యను ముందు చంపి, ఆ తర్వాత బిడ్డలను గొంతుకోసి..మూడు రోజులుగా ఆ ఇంట్లోనే ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆపై అతడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని, ఆవేశంతోనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.