చత్తీస్‌గడ్‌లో లాక్‌డౌన్ సమయంలో మోటారు సైకిలుపై బయటకు వచ్చిన యువకునిపై దురుసుగా ప్రవర్తించడమే కాక, చేయిచేసుకుని అతని సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేసిన సూరజ్‌పూర్ జిల్లా కలెక్టర్ రణవీర్ శర్మ తన ఉద్యోగం కోల్పోవలసి వచ్చింది. సూరజ్‌పూర్‌లో మందులను కొనుక్కోడానికి శనివారం బయటకు వచ్చిన అమన్ మిట్టల్ ను కలెక్టర్ రణవీర్ తోపాటు పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్‌కు మిట్టల్ ఏదో కాగితం తీసి చూపించి, మొబైల్ ఫోన్‌లో వివరాలు కూడా చూపించాడు. ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న లాక్‌డౌన్ మధ్య మందులు కొనుగోలు చేసేందుకు బయటకు వచ్చిన ఓ యువకుడిని సూరజ్‌పూర్ జిల్లా కలెక్టర్ రణవీర్ శర్మ చేయి చేసుకోవడంతో పాటు అతని ఫోన్‌ను ధ్వంసం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనమైంది. ఉన్నత స్థాయి అధికారి ఉండి ఆయన వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. రణ్వీర్ శర్మను తక్షణమే విధులను నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కలెక్టర్ శర్మను సస్పెండ్ చేసినట్లు సీఎం భూపేశ్ బఘేల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. విచారకర సంఘటన అనీ, ఇలాంటి చర్యలను సహించమని స్పష్టం చేశారు. యువకుడి కుటుంబానికి క్షమాపణలు చెప్పారు.
ఐఏఎస్ అధికారుల సంఘం సైతం కలెక్టర్ చర్యలను తీవ్రంగా ఖండించింది. ఘటనపై ఐఏఎస్ అధికారుల సంఘం సైతం స్పందించింది. ఘటన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, సివిల్ సర్వెంట్ల ప్రాథమిక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉందని పేర్కొంది. సమాజం పట్ల సివిల్ సర్వెంట్లు సానుభూతిని కలిగి ఉండాలని, ఈ క్లిష్ట సమయంలో మరింత ముఖ్యమని చెప్పింది. ముఖ్యమంత్రి ఆదేశాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నవరాయ్‌పూర్ సెక్రటేరియట్‌కు బదిలీ చేశారు. రణవీర్ శర్మ స్థానంలో రాయ్‌పూర్ జిల్లా పంచాయత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌరవ్ కుమార్ సింగ్‌ను కలెక్టర్‌గా నియమించారు. ఐఎఎస్ ఆఫీసర్ల సంఘం కూడా రణవీర్ శర్మ దురుసుతనాన్ని తీవ్రంగా ఖండించింది.