గత కొంత కాలంగా మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఆ వ్యాధితో ఇబ్బంది పడుతూనే యశోద సినిమాను పూర్తి చేసింది సామ్. ఇక సామ్ అనారోగ్యం కారణంగా గత కొంత కాలంగా వాయిదా పడుతున్న చిత్రం ‘ఖుషీ’. విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా సామ్ ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. దాంతో సినిమా లేట్ అవుతున్నందుకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు తాజాగా క్షమాపణలు చెప్పింది సమంత. ఈ క్రమంలోనే ఈ క్షమాపణలపై స్పందిచాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.
ట్వీటర్ వేదికగా..”మేము అందరం నీ రాక కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. నువ్వు పూర్తి ఆరోగ్యంతో నవ్వుతూ తిరిగి రావాలని కోరుకుంటున్నాం” అని రాసుకొచ్చాడు విజయ్ దేవరకొండ. అయితే విజయ్ ఖుషీ తర్వాత గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ మూవీని ప్రకటించారు. ఈ రెండు సినిమాల్లో గెటప్స్ వేర్వేరు కావడంతో విజయ్ ఖుషీ సినిమా పూర్తి అయ్యే దాక మరో సినిమా చేయడానికి వీలు లేకుండా ఉంది. దాంతోనే సామ్ పై విమర్శలు చేశారు విజయ్ అభిమానులు. దాంతో సామ్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పింది. ప్రస్తుతం సమంత ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ షూటింగ్ కోసం ముంబైలో ఉంది. మరి సినిమా లేట్ అవుతున్నప్పటికీ సమంతపై విజయ్ చూపిస్తున్న ప్రేమపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
We all await your return in full health and your big smile ❤️ https://t.co/kuSN1ZdGj3
— Vijay Deverakonda (@TheDeverakonda) February 1, 2023