ఈ మధ్య కాలంలో చాలా మంది పెళ్లిల్లు బరాత్‌లేనిది ముగించుకోరంటే అతిశయోక్తి కాదు. బ్యాండ్ బాజాతో అత్తారింటికి కొత్త పెళ్లి కూతురిని ఘనంగ ఆహ్వానిస్తారు. ఆమె వస్తుందంటే పెళ్లి కొడుకు ఇంట్లో ఆ హుషారు, సందడి వేరనేది చెప్పికనక్కర్లేదు. ఇక పెళ్లి ముగించుకుని బరాత్‌తో అంతా బ్యాండ్ బాజాతో కుటుంబ సభ్యులు అంతా చిందులేస్తూ తెగ ఎంజాయ్ చేస్తారు. ఆ బరాత్‌లో అందరూ డ్యాన్స్ చేస్తే మాములే.. కానీ అదే పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తే ఇంకేముంది ఇక ఈలలే.
ఓ పెళ్లి కూతురు డ్యాన్స్ చేసిన ఇలాంటి ఓ వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ హల్చల్ చేస్తూ దూసుకుపోతోంది. ఇందులో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఇద్దరు కలిసి బుల్లెట్ బండెక్కి వచ్చేస్తవా..డుగ్గు డుగ్గు అంటూ సాగే పాటకు డ్యాన్స్ చేస్తున్నారు. కానీ ఈ పాటకు పెళ్లి కూతురు మాత్రం డ్యాన్స్ ఇరగదీసింది. దీంతో పెళ్లి కొడుకు కూడా ఆమెతో కాసేపు స్టెప్పులేసి ఆమె డ్యాన్స్‌కు ఫిదా అయిపోయాడు.
ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు సంతోషంతో మీరు జీవితాంతం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పెళ్లి కూతురు డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇది ఎక్కడ జరిగిందనేది మాత్రం తెలియరాలేదు. ఇక మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.