ఏనుగు ఆ పేరు వింటేనే కొందరికి చెమటలు పడతాయి. దాని ఘీంకారం విన్నా.. దగ్గర నుంచి చూసిన పై ప్రాణాలు పైనే పోతాయి. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం మీరు ముక్కున వేలేసుకుంటారు. అస్సాంకు చెందిన బిను, హర్షిత బోరాలకు ఏనుగులే ఫ్రెండ్స్. బిను అనే చిన్నారి ఏనుగు పొదుగు పట్టుకుని పాలు తాగేస్తోంది. ఇక హర్షిత అయితే ఏనుగుతో ఫుట్ బాల్ ఆడుతోంది. భయం లేదా అంటే నాకెందుకు భయం.. నా ఫ్రెండేగా అంటూ చెబుతున్నారు. కొందరు ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇంకేముంది.. ఆ వీడియో కాస్తా వైరల్ గా మారింది. వీళ్లు మావటివాడి పిల్లలు అని తెలుస్తోంది. మరెందుకు ఆలస్యం ఆ వైరల్ వీడియో మీరూ చేసేయండి. ఈ చిన్నారుల ధైర్య సాహసాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.