తెలుగు టివిల్లో చాలా మంది యాంకర్లు ఉన్నారు. వీరిలో ఒకరు తీన్మార్ సావిత్రి అలియాస్ శివ జ్యోతి. తెలంగాణ యాసలో మాట్లాడటడంతో మంచి పేరు కూడా వచ్చింది. అయితే బిగ్ బాస్ తో ఆమెకు మంచి పేరు వచ్చింది. బయటకు వచ్చాక సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిపోయిన ఆమె.. ఇటీవల పెట్టిన ఫోటో వైరల్ గా మారింది.
షోలందూ రియాలిటీ షోలు వేరయా.. అందులో బిగ్ బాస్ దారీ, తీరు వేరయా. ఇప్పటి వరకు ఈ షో ఆరు సీజన్లు ముగిశాయి. ఇప్పటి వరకు ఎంతో మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్లు వచ్చి అలరించారు. ఇన్ని సీజన్లలో బిగ్ బాస్ మూడోలో ఎక్కువ మంది లేడీ కంటెస్టెంట్లు అలరించారు. వారిలో అషూ రెడ్డి, శివజ్యోతి, హిమజ, రోహిణీ, పునర్నవీ, వితికా షేరు, శ్రీముఖి, హేమ ఉన్నారు. అయితే వీరిలో తొలి కంటెస్టెంట్ గా వచ్చారు తీన్మార్ యాంకర్ సావిత్రి అతియాస్ శివ జ్యోతి. తీన్మార్ షోలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ గుర్తింపు తెచ్చుకున్న శివ జ్యోతి ఆ సీజన్ లో ఆమె ఎక్కువ ఏడుపులు, పొడబొబ్బుల కంటెస్టెంట్ గా అందరికీ గుర్తిండిపోతుంది. దీంతో ఆమెపై శివ జ్యోతి కాదూ పాతాళ గంగ అంటూ ట్రోల్స్ కూడా వచ్చాయి.
ఏదైమైనప్పటికీ ఆమె బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్లకు ప్రియమైన అక్కగా మారిపోయింది. అందరూ ఆమెను జ్యోతక్క అని పిలవడం ప్రారంభించారు. ఆ షోలో కంటెస్టెంట్ గా వచ్చిన సీరియల్ నటులు రవికృష్ణ, అలీ రెజా అయితే తమ సొంతక్కలానే భావించారు. కరోనా సమయంలో రవితేజ దగ్గర ఉండి చూసుకుంది. అలీ రెజా భార్యకు శ్రీమంతం నిర్వహించడం వంటివి చేశారు. తన భర్త గంగూలీని సైతం కలిసి రియాల్టీ షోలోకి తీసుకువచ్చి అతడ్ని ఫేమస్ చేసేశారు. గతంలో ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు రాగా, వాటిని ఖండించింది. సోషల్ మీడియాలో సైతం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే సావిత్రి.. పలు ఫోటోలు, వీడియోలు పంచుకుంటూ ఉంటుంది. గత ఏడాది లగ్జరీ కారు కొని వార్తల్లో నిలిచింది.
మొన్నటి మొన్న కాశ్మీర్, తాజ్ మహాల్ ట్రిప్ వీడియోలతో అలరించిన శివ జ్యోతి.. తాజాగా ఓ ఫోటోను పోస్టు చేసింది. తాజాగా ఈ యాంకర్అం తన పుట్టిన రోజు వేడుకలను చేసుకుంది. తనకు 30 ఏళ్లు వచ్చాయంటూ ఆనందంతో మునిగి తేలుతుంది. అందులో పొట్టి దుస్తుల్లో కనిపిస్తూ.. 30 ఇయర్స్ బెలూన్స్ ను చేతిలో పట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను ఆమె తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకుంటూ తనకు పుట్టిన రోజు విష్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా తన భర్తకు ప్రేమికుల దినోత్సవం పురస్కరించుకుని విషేస్ తెలిపింది.