బొమ్మరిల్లులో చీమ కథ చెబుతూ హాసిని పాత్ర ఎంత దగ్గరయ్యిందో.. బుల్లి తెరపై కూడా యాంకర్ లాస్య ఈ కథలే చెప్పి ప్రేక్షకులకు చేరువయ్యారు. చలాకీతనం, కొంటెతనం, చక్కని చిరునవ్వు ఆమె సొంతం. ఇంట్లో అమ్మాయిలా మారిన ఆమె సడెన్ గా యాంకరింగ్ కు గుడ్ బై చెప్పి.. కుటుంబ జీవితంలోకి అడుగుపెట్టారు. మంజునాథ్ అనే వ్యక్తిని వివాహం చేసుకోగా.. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. తాజాగా మరోసారి లాస్య, మంజునాథ్ లు తల్లిదండ్రులయ్యారు
యాంకర్ లాస్య మంజునాథ్. తెలుగు టివి ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు. సమ్ థింగ్ స్పెషల్ అనే షోతో యాంకర్ గా జర్నీ ప్రారంభించిన లాస్య దానితోనే మంచి పేరు తెచ్చుకున్నారు. మరో యాంకర్ రవితో కలిసి ఈ షో చేసేవారు. ముఖ్యంగా చీమ ఏనుగు జోక్స్‌తో బాగా పాపులర్ అయ్యారు లాస్య. లాస్య.. మంజునాథ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని కొన్నాళ్ల పాటు బుల్లి తెరకు దూరమయ్యారు. అయినప్పటికీ తన యూట్యూబ్ చానల్స్ ద్వారా తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఆ మధ్య బిగ్ బాస్ తెలుగు 4 రియాలిటీషోలో పాల్గోని అదరగొట్టారు. లాస్య, మంజునాథ్ జంటకు గతంలో దక్షిత్ అలియాస్ జున్ను అనే కుమారుడు జన్మించగా.. మరోసారి వీరిద్దరూ తల్లిదండ్రులయ్యారు.
లాస్య పండింటి బిడ్డకు జన్మనిచ్చింది. హోలీ రోజున లాస్య మంజునాథ్ లకు పండంటి మగ బిడ్డ పుట్టాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా లాస్య పంచుకున్నారు. హ్యాపీ హోలీ అంటూ తనకు పుట్టిన బిడ్ద ఎవరన్నదీ రివీల్ చేస్తూ వీడియోను రూపొందించారు. ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోపై పలువురు యాంకర్లు, నటులు తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బిగ్ బాస్ బ్యూటీ, నటి సిరి హన్మంత్ కంగ్రాట్స్ చెప్పగా.. మరో యాంకర్ స్రవంతి చొక్కారపు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. తనకు సంబంధించిన ప్రతి వీడియోను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు లాస్య. భర్త మంజునాథ్, కొడుకు జున్నులకు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు తన భర్తతో కలిసి పలు టివి షోల్లో పాల్గొని సందడి చేస్తారు.
తెలుగు యాంకర్లలో లాస్యది ప్రత్యేకమైన స్థానమనే చెప్పాలి. అనసూయ , రష్మీ, శ్రీముఖి.. లాంటివాళ్లతో పోటీని తట్టుకంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు లాస్య. చక్కనైన నవ్వుతో.. పాజిటివ్ మనస్థత్వంతో ఉంటారు. మన ఇంట్లో అమ్మాయిగా లాస్యను ప్రేక్షకులు చూసేవారు. కొన్ని సినిమాలు చేసినప్పటికీ.. ఆ తర్వాత పలు వ్యక్తిగత కారణాలతో బుల్లి తెరకు దూరంగా ఉన్నారు. టీవీ తెరపై చలాకీ మాటలతో ప్రేక్షకులకి అలరించే లాస్య జీవితంలోను ఎన్నో విషాద గాధలు ఉన్నాయి. అందులో కొన్ని ఆ మధ్య బిగ్ బాస్ తెలుగు 4లో ఓ కంటెస్టెంట్ గా పాల్గొన్న సమయంలో కొన్ని విషయాలు బయటపెట్టారు. లాస్య తన కడుపులో బిడ్డని చంపుకున్న విషయాన్ని చెబుతూ కన్నీరు పెట్టుకున్న సంగతి విదితమే.