ప్రపంచంలో విషపూరితమైన జీవి ఏదీ అంటే వెంటనే పాము అని అంటారు. పామును చూస్తే ఎవరికైనా వెన్నుల్లో వణుకు పుడుతుంది.. పాము ఉందని తెలిస్తే చాలు పరుగులు పెడతారు.. అక్కడికి వెళ్లాలంటేనే భయపడిపోతారు. ప్రపంచంలో అత్యంత విషపూరితమైన సర్పం కింగ్ కోబ్రా. ఇది ఎంతో పొడవుగా ఉండటమే కాదు.. గాల్లోనే విషాన్ని చిమ్ముతుందని.. అది ఎంతో ప్రభావవంతమైనదిగా ఉంటుందని అంటారు. అలాంటి కింగ్ కోబ్రాకు ఓ మనిషి బాత్ రూమ్ లో స్నానం చేయించడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ మద్య కాలంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో వింతలూ విశేషాలు మన కళ్ల ముందు ఆవిష్కరించబడుతున్నాయి. అలాంటి వీడియోల్లో కొన్ని కడుపుబ్బా నవ్విస్తుంటే.. మరికొన్ని ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటున్నాయి. సాధారణంగా పాములు చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది.. కానీ ఈ మద్య కొంతమంది పాములను సింపుల్ గా పట్టేస్తున్నారు.. అంతేకాదు తమను కాటేసిందని కసితో కొరికి చంపిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఓ వ్యక్తి బారెడు పొడవున్న కింగ్ కోబ్రాకు ఇంట్లో చంటిపిల్లలకు సబ్బు పెట్టి స్నానం చేయించినట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఓ వ్యక్తి పొడవైన కింగ్ కోబ్రాకు జగ్గుతో నీళ్లు తీస్తూ స్నానం చేయిస్తున్నాడు. ఆ సమయంలో పాము ఆ జగ్గును పదే పదే కాటు వేస్తుంది.. కానీ స్నానం చేయిస్తున్న మనిషిని మాత్రం ఏమీ అనడం లేదు.. దాంతో ఆ వ్యక్తి తాపీగా ఆ పాముకు సబ్బు పెట్టి మరీ స్నానం చేయించాడు. ఈ వీడియో ఇన్ స్ట్రాలో వైరల్ అయింది. గతంలో కొంత మంది పాములకు బురుద అంటిందని స్నానం చేయించారు.. కానీ బాత్ రూమ్ లో ఇలా శ్రద్దగా స్నానం చేయించడం ఇదే మొదటి సారి అంటు వార్తలు వస్తున్నాయి. దీనిపై నెటిజన్లు రక రకాల కామెంట్స్ పెడుతున్నారు. మగవాళ్లకు ఎక్కువ ధైర్యం ఉంటుంది.. అందుకే ఇలాంటి స్టంట్స్ చేయిస్తుంటారని కామెంట్స్ చేస్తున్నారు.