వాళ్లిద్దరూ భార్యాభర్తలు. ఐటీ ఉద్యోగాలు చేస్తూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇలా లక్షల్లో వచ్చే ఐటీ ఉద్యోగాలను వదలుకుని ఈ దంపతులు తమకు నచ్చిన దారిలో అడుగులు వేశారు. మీరనుకుంటున్నట్లు సెంద్రీయ వ్యవసాయం చేయడమో, సొంత బిజినెస్ స్టార్ట్ చేయడమో అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అందులో ఈ దంపతులకు ఆశించిన డబ్బు రాకపోయినా తమ అభిరుచి కోసం తమకు నచ్చిన పనిని చేసేందుకు ఇష్టపడుతున్నారు. అసలు ఈ దంపతులు ఎవరు? నెలకు లక్షల్లో వచ్చే ఐటీ ఉద్యోగాలను వదిలి ఇప్పుడు ఏం చేస్తున్నారు? అసలు వీరి స్టోరీ ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బెంగుళూరు ఉడిపి జిల్లా కుందాపూర్ కు చెందిన అనూష అనే యువతి చిన్నప్పటి నుంచి చదువుల్లోరాణిస్తూ ఉండేది. ఉన్నత చదువులు చదివిన అనూష బీటెక్ పూర్తి చేసి క్యాంపస్ సెలక్షన్ లో ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం సాధించింది. ఇక నెలకు లక్షల జీతాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్తోంది. కానీ అనూషకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే మహా ఇష్టం. ఎక్కడ డ్యాన్స్ షో వేసినా అక్కడకు వెళ్లి చూసి నేర్చుకునేది. అలా ఉద్యోగం చేస్తున్న క్రమంలోనే అనూషకు 2015లో సౌరభ్ అనే ఐటీ ఉద్యోగి పరిచయం అయ్యాడు. అనూష అతనితో కొన్నాళ్ల పాటు స్నేహం చేసింది. ఆ స్నేహం కొన్నాళ్ళ తర్వాత ప్రేమగా మారింది. ఇక సౌరభ్ కు కూడా డ్యాన్స్ అంటే మక్కువ. ఇక ఇద్దరి అభిరుచులు ఒకటే కావడంతో గతంలో ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు.
దీంతోపాటు ఇద్దరు ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. వీరి జీవితం సంతోషంగా సాగుతున్నా ఈ దంపతులకు ఏదో వెలితిగా అనిపించింది. ఈ క్రమంలోనే ఈ దంపతులు ఇద్దరూ కలిసి జోడీ అనురాభ్ అనే యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించారు. వివిధ రకాల డ్యాన్సులు చేస్తూ అందులో పోస్ట్ చేశారు. ఇక వారి డ్యాన్స్ వీడియోలకు రోజు రోజుకు వ్యూస్ పెరగడంతో పాటు సబ్ స్క్రైబర్లు కూడా పెరిగారు. వారంతల్లో సెలవు కావడంతో ఈ జంట రక రకాల డ్యాన్స్ లు చేస్తూ తమ యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేసేవారు. ఇక వీరి డ్యాన్స్ వీడియోలకు వీక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ఈ క్రమంలోనే ఈ దంపతులిద్దరూ తమ ఐటీ ఉద్యోగాలకు రాజీనామా చేసి పూర్తిగా డ్యాన్స్ మీద ఫోకస్ పెట్టారు. ఇక ఇందులో వీరికి లక్షల జీతం రాకపోయినప్పటికీ వీక్షకుల నుంచి మంచి స్పందన ఉండడంతో ఈ జోడీ తెగ సంతోషపడుతూ ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు.