ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనదారులు రోడ్డెక్కితే ట్రాఫిక్ పోలీసులు అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. హెల్మెట్ పెట్టుకోకపోయినా, సీటు బెల్ట్ ధరించకపోయినా, లైసెన్స్, ఆర్సీ వంటి పత్రాలు వంటివి లేకపోయినా పోలీసు అధికారులు ఛలాన్ విధిస్తారు. మరీ ఇలాంటి నిబంధనలు పోలీసులకు కూడా వర్తిస్తాయని రుజువు చేశాడు బెంగుళూరులోని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్దంగా రోడ్డుపై వచ్చిన మరో పోలీసును డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపి అతనికి ఫైన్ విధించాడు.
అలా చలాన్ విధిస్తూ అతనితో దిగిన ఫొటో తాజాగా సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. కర్ణాటక రాజధాని బెంగుళూరు ఆర్టీ నగర్ లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ హాఫ్ హెల్మెట్ ధరించి నిబంధనలకు విరుద్దంగా రోడ్డుపైకి వచ్చాడు. ఇక అదే సమయానికి రోడ్డుపై డ్యూటీ చేస్తున్న మరో ట్రాఫిక్ పోలీస్ అతనిని హాఫ్ ఆఫ్ హెల్మెట్ ధరించినందుకు ఫైన్ విధించారు.
అనంతరం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్దంగా వాహనాన్ని నడిపిన ఆ పోలీస్ అధికారికి జారీ చేసిన ట్రాఫిక్ చలాన్ ను చూపిస్తూ ఓ ఫొటో తీసుకున్నాడు. ఇక ఇదే ఫొటోను ఆర్టీ నగర్ ట్రాఫిక్ బీటీపీ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. హాఫ్ హెల్మట్ కేసు బక్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇదే ఫొటో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి ఎవరు ముందుకెళ్లినా, చివరికి పోలీసులకు కూడా ఈ విధమైన చలాన్ విధస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా పోలీస్ అధికారు సక్రమంగా డ్యూటీ చేస్తున్నారు అంటూ పలువురు అతని పని తీరును మెచ్చుకుంటున్నారు.
Good evening sir
half helmet case booked against police
Tq pic.twitter.com/Xsx5UA40OY— R T NAGAR TRAFFIC BTP (@rtnagartraffic) October 17, 2022