ఓ యువకుడు ఏదో పనిమీద బైక్ పై వెళ్లాలని పయనమయ్యాడు. తొందర దొందరగా బైక్ స్టార్ట్ చేశాడు. ఇక గేర్లు మార్చుతూ బైక్ వేగాన్ని పెంచాడు. ఇక హాయిగా పాటలు పాడుతూ బైక్ ని స్టైల్ గా నడుపుతూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి బైక్ స్పీడ్ మీటర్ నుంచి ఏదో శబ్దం వినిపించింది. ఏంటా అని ఆ యువకుడు స్పీడ్ మీటర్ వైపు చూశాడు. ఇక అంతే అందులోంచి నాగుపాము పడగెత్తి కనిపించింది. ఈ దెబ్బతో మనోడి ప్యాంట్ తడిసి ముద్దైంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్య ప్రదేశ్ లోని నర్సింగ్ పూర్ ప్రాంతంలో నజీర్ ఖాన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అయితే ఇటీవల తెల్లవారుజామున ఆ యువకుడు ఏదో పని మీద బైక్ పై బయటకు వెళ్లాలనుకున్నాడు. అందుకోసం తన బైక్ తీసి స్టార్ చేసి 5, 6 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లాడు. పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాడు. అలా వెళ్తున్న క్రమంలోనే అతని బైక్ స్పీడ్ మీటర్ నుంచి ఏదో శబ్దం వినిపించింది. ఏంటా అని చూడగా స్పీడ్ మీటర్ నుంచి నాగుపాము పడగెత్తి కనిపించింది.
ఈ సీన్ ను చూసిన ఆ యువకుడికి ఒక్కసారిగా గుండె పగిలినంత పనైంది. ఏం చేయాలో అర్థం కాక వెంటనే బైక్ ను ఓ చోట ఆపి చూశాడు. ఇక నిజంగానే అందులో నాగుపాము పడగెత్తి కనిపించింది. దీనిని గమనించిన స్థానికులు గుమిగుడి బైక్ స్పీడ్ మీటర్ ను పగల గొట్టి అందులో ఉన్న నాగుపామును బయటకు తీశారు. ఇక వీటన్నిటినంత వాహనదారులు వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అవి కాస్త వైరల్ గా మారాయి. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమవుతోంది.
: नरसिंहपुर में मोटरसाइकिल के मीटर में घुसा सांप pic.twitter.com/W8Dcu6fzoG
— NaiDunia (@Nai_Dunia) October 17, 2022