ఆకాశంలో ఎగురుతున్న విమనాన్ని ఉన్నట్టుండి ఓ పక్షి ఢీ కొట్టింది. వినటానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఇది నిజం. తాజాగా చోటు చేసుకున్న ఈ దెబ్బతో ఆ విమాన ముందు భాగం స్వల్పంగా దెబ్బతినింది. దీంతో వెంటనే స్పందించిన అధికారులు తక్షణమే విమనాన్ని ల్యాండింగ్ కు అనుమతులిచ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఏం జరిగిందంటే? గురువారం ఉదయం అహ్మదాబాద్ నుంచి ఆకాశ భీ 797-8 అనే విమానం ఢిల్లీ వెళ్లేందుకు పయనమైంది.
దీంతో అలా ఆకాశంలో 1900 ఫీట్ల ఎత్తులో ఎగురుతూ ఉంది. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి ఆ విమానానికి ఎదురుగా అటు నుంచి వచ్చిన ఓ పెద్ద పక్షి ఆ విమానం ముందు భాగాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆ విమాన ముందు భాగం స్వల్పంగా దెబ్బతినింది. వెంటనే స్పందించిన అధికారులు విమానాన్ని తక్షణమే ల్యాండింగ్ కు అనుమతిచ్చారు. దీంతో ఫైలెట్లు ఆ విమానాన్ని సురక్షితంగా కిందకు దించారు. దీనిపై స్పందించిన ఆకాశ ఎయిర్ లైన్ అధికారులు పక్షి ఢీ కొట్టిన కారణంగానే తక్షణమే ల్యాండింగ్ కు అనుమతిచ్చామని, దీంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఇక ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.