మంచి చదువు చదువుకొని సమాజంలో మంచి పొజీషన్లో ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు.. కానీ పరిస్థితుల కారణం, ఆర్థిక ఇబ్బందుల వల్ల మద్యలోనే చదువు ఆపిన వారు ఎంతోమంది ఉంటారు.
కృషీ.. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవొచ్చు అని.. పేదరికంలో ఉన్నప్పటికీ కష్టపడి చదవి సమాజంలో గొప్ప స్థాయికి చేరుకొవచ్చు అని ఎంతో మంది నిరూపించారు. కొంతమందికి గొప్పగా చదువుకొని డిగ్రీ పట్టా పొందాలనే ఆశ ఉంటుంది.. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల చదువును మద్యలోనే ఆపివేసిన వారుచాలా మంది ఉంటారు. కానీ వయసు పెరిగిన తర్వాత మళ్లీ చదువుకోవాలన్న ఆశతో కష్టపడి చదవి డిగ్రీ పట్టా పొందిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో రాజకీయ నేతలు, సెలబ్రెటీలు కూడా ఉన్నారు. ఓ తల్లి తన కొడుకుతో పాటు కష్టపడి చదివి కొడుకన్నా ఎక్కువ మార్కులు సాధించింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
చదువుకోవాలన్న ఆశ ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలించక చిన్నతనంలోనే ఆపివేసిన వారు ఎంతోమంది ఉన్నారు. ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలతో పోటీగా మళ్లీ చదువుపై దృష్టిసారించి ఉన్నత విద్యనభ్యసించినవారిని ఎంతోమందిని చూశాం. పశ్చిమ బెంగాల్ కి చెందిన లతికా మోండల్ అనే 38 ఏళ్ల మహిళ ఆర్థిక ఇబ్బందుల కారణంగా 6వ తరగతి వరకు చదివి ఆపివేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని కుటుంబాన్ని చూసుకుంటూ వచ్చింది. కానీ లతిక కు చదువుపై ఎప్పుడూ ఆసక్తి ఉండేది.. ఈ క్రమంలోనే పిల్లలకు పాఠాలు చెబుతూ తాను కూడా చదువుకోవడం ప్రారంభించింది. అతా తన కుమారుడు సౌరవ్ తో కలిసి ఇటీవల 12వ తరగతి ఎగ్జామ్స్ రాసింది.
విచిత్రం ఏంటంటే లతికకు 500 కు 324 మార్కులు రాగా.. ఆమె కొడుకు సౌరవ్ కి 284 మార్కులు వచ్చాయి. కొడుకు మార్కుల కన్నా తల్లి మార్కులు ఎక్కువ సాధించడంతో అందరూ ప్రశంసించారు. జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి.. వాటన్నింటిని ఎదుర్కొని పోరాడుతూ నిలబడాలి. ఏ పని మొదలు పెట్టినా.. అందులో ఎన్ని అవాంతరాలు ఉన్నా.. పట్టుదలతో ఆ పని పూర్తి చేయాలి. చదువుకు వయసతో సంబంధం ఉండదు.. చదువుకోవాలన్న ఆకాంక్ష ఉంటే ఏదైనా సాధించవొచ్చు అని ఓ మధ్యతరగతి మహిళ నిరూపించింది. లతిక సాధించిన మార్కుల గురించి తెలుసుకొని స్థానికులు సైతం ఆమెను ప్రశంసించారు.