ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోడ్డు పైనే కాదు.. ఆకాశ మార్గంలో కూడా వరుసగా విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సాంకేతిక లోపాలు తలెత్తడం, పక్షులు ఢీ కొట్టడంతో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ఇటీవల భూమిపైనే కాదు.. ఆకాశ మార్గంలో కూడా ప్రమాదాల సంఖ్య బాగా పెరిగిపోతున్నాయి. టెకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానాలు, హెలికాప్టర్స్ టెక్నికల్ సాంకేతిక లోపాల కారణంగా పైలెట్లు అత్యవసర ల్యాండింగ్ చేస్తూ ప్రయాణికుల ప్రాణాలు రక్షిస్తున్నారు. కొన్నిసార్లు ఆకాశ మార్గంలో పక్షులు ఢీ కొట్టడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ విమానాన్ని పక్షి ఢీ కొట్టడంతో పైలెట్ తీవ్రంగా గాయపడ్డాడు.. అంత క్లిష్ట పరిస్థితుల్లో ప్లైట్‌ను చాకచక్యంగా ల్యాండ్ చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ మద్య కాలంలో వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. టెకాఫ్ అయిన కొద్దిసేపటి తర్వాత టెక్నికల్ ఇబ్బందులు, వాతావరణం అనుకూలించకపోవడం, పక్షులు ఢీ కొట్టడం ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో పైలెట్స్ చాకచక్యంగా వ్యవహరించి ఎమర్జెన్సీ ల్యాండ్ చేస్తూ ప్రయాణికుల ప్రాణాలు రక్షిస్తున్నారు. కొన్నిసార్లు ప్రమాదంలో ఎంతోమంది చనిపోతున్నారు. తాజాగా ఓ పెద్ద పక్షి విమానం విండ్ షీల్డ్ ని ఢీ కొట్టడంతో లోపల ఉన్న పైలెట్ కి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఆ పక్షి అలా వేలాడుతూ ఉంది.. అద్దంలో నుంచి వస్తున్న గాలికి విమానం కుదుపులు మొదలయ్యాయి.
ఓ వైపు ముఖం నిండా రక్తం కారుతున్నప్పటికీ ప్రయాణికులను సురక్షితంగా ల్యాండ్ చేయాలనే ఉద్దేశంతో ఏరియల్ వాలిటైల్ అనే పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానం చేర్చాడు. రక్తమోడుతూ ఆ పైలెట్ తీసుకున్న రిస్క్.. ధైర్య సాహసాలను నెటిజన్లు, అధికారులు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ఘటన ఈ క్వెడార్ లో జరిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Viral Video | విమానాన్ని ఢీకొన్న భారీ పక్షి.. పైలట్ ముందు కాళ్లు వేల్లాడుతున్నా సేఫ్ ల్యాండింగ్ https://t.co/JN0S15kn7g #Adipurush Telugu Prabhas #Anupamaa #OmRaut #telugunews @hyderabad pic.twitter.com/UMkF2roqSp
— vidhaathanews (@vidhaathanews) June 17, 2023