గుజరాత్ లో ఓ స్కూల్ విద్యార్థినిని ఓ యువకుడు వేధించాడు. తట్టుకోలేకపోయిన ఆ బాలిక.. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే అతడిని చితక్కొట్టి దిమ్మతిరిగే షాకిచ్చింది. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
దేశంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోంది. రోడ్డపై అమ్మాయి కనిపిస్తే చాలు.., ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారు. కాదంటే అత్యాచారాలు, లేకుంటే హత్యలు చేస్తూ అమాయక యువతుల ప్రాణాలు తీస్తున్నారు. అచ్చం ఇలాగే రెచ్చిపోయిన ఓ ఆకతాయి.. తాజాగా ఓ స్కూల్ విద్యార్థినిని నడి రోడ్డుపై వేధించాడు. ఇక భరించలేకపోయిన ఆ అమ్మాయి కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. ఇతరుల సాయం కోసం వేచి చూడకుండా అందరూ చూస్తుండగానే అతనికి సరైన బుద్ది చెప్పింది. ఇదే వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ అహ్మదాబాద్ లోని భూలాభాయ్ ప్రాంతంలో ఓ అమ్మాయి నివాసం ఉంటుంది. ఆ బాలిక ఇక్కడే ఓ స్కూల్ లో చదువుకుంటుంది. అయితే, ఆ అమ్మాయి నడుచుకుంటూ రోజూ స్కూల్ కు వెళ్తూ ఉండేది. ఈ క్రమంలోనే స్థానికంగా ఉండే ఓ యువకుడు ఆ విద్యార్థినిని రోజూ వేధిస్తూ ఉండేవాడు. కొన్ని రోజులు ఆ బాలిక చూసి చూడనట్లుగా వదిలేసింది. కానీ, అతని వేధింపులు రోజు రోజుకు మరింత ఎక్కువయ్యాయి. ఇదిలా ఉంటే.. ఆ యువకుడు ఆ విద్యార్థిని మరోసారి వేధించాడు. తట్టుకోలేకపోయిన ఆ బాలిక.. అందరిముందే నడి రోడ్డుపై అతడిని చితక్కొట్టి దిమ్మతిరిగే షాకిచ్చింది. దీనిని గమనించిన కొందరు వ్యక్తులు ఆ యువకుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే, ఆ బాలిక అతడిని కొడుతుండగా వాహన దారులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.
— krishna veni (@krishna66577649) June 23, 2023