ప్రేమకు వయసు, కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేదని ఓ జంట నిజం చేసి చూపించింది. గత రెండేళ్లుగా ప్రేమాయాణంలో ఉన్న ఈ జంట ఇటీవల నిశ్చితార్ధం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నామని చెబుతున్నారు. ఈ జంటను చూసి స్థానికులు అంత చర్చించుకుంటున్నారు. ఇదే అంశం ఇప్పుడు ప్రపం వ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలు వీళ్లు ఎవరూ అనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఉత్తర థాయ్ లాండ్ లోని సఖోన్ నఖోన్ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో నమువన్ గ్రామ్ అనే మహిళ 56 ఏళ్ల మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు పెళ్లై 30 ఏళ్ల నిండిన పిల్లలు ఉన్నారు. ఇకపోతే గతంలో నమువన్ గ్రామ్ భర్తతో విభేదాలు వచ్చి అతనితో విడిపోయింది. అప్పటి నుంచి నమువన్ గ్రామ్ ఇంట్లో ఒంటరిగా ఉంటూ ఉండేది. ఇక వయసు మీద పడుతుండడంతో ఇంట్లో అన్ని పనులు చేయాలంటే ఆమె తరం కాకపోయేది. దీంతో వీరి ఇంటి పక్కనే వుతిచాయ్ చంతరాజ్ అనే 19 ఏళ్ల కుర్రాడు ఉండేవాడు. అయితే ఇతనికి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నమువన్ గ్రామ్ తన ఇంట్లో చిన్న చిన్న పనులు చేసేందుకు చంతరాజ్ ను సాయం అడిగింది.
ఆమె సాయాన్ని కాదనలేని ఆ కుర్రాడు అప్పటి నుంచి ఆమెకు సాయం చేస్తూ ఉండేవాడు. అలా రోజు చంతరాజ్ ఆమె ఇంట్లో అన్ని పనులు చేస్తున్న క్రమంలోనే వీరిద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఆ పరిచయమే చివరికి వీరిద్దరూ ప్రేమించుకునే దాక వెళ్లింది. దీంతో వీరిద్దరూ గత రెండేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారట. ఇదే కాక గత కొంత కాలం నుంచి డేటింగ్ లో కూడా ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే కాదండోయో.. ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగి త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. ఇక ఈ జంటను కొందరు ఆశ్చర్యపోతుంటే మరికొందరు తమలో తాము నవ్వుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం ఇప్పుడు వార్తల్లో నిలిచి తీవ్ర చర్చనీయాంశమవుతోంది.