ఓ గ్రామ వాలంటీర్ ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసిన ఘటన కడపలో చోటుచేసుకుంది. న్యాయం కోసం ఆయువతి యువకుడి ఇంటిముందు ఆందోళనకు దిగింది.
ఒకరికి ఒకరు గాఢంగా ప్రేమించుకుని కలిసి జీవితం పంచుకోవాలని అనుకునేది కొందరైతే.. దొరికిందే ఛాన్స్ అని మోసానికి తెరలేపేవారు కొందరు. ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడుతు తమ వక్ర బుద్దిని చాటుకుంటున్నారు కొందరు యువకులు. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వంచిస్తూ దారుణాలకు ఒడిగడుతున్నారు. మహిళా రక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చట్టాలను తీసుకొస్తున్నప్పటికి మోసాలను అరికట్టలేకపోతున్నారు. ఈ క్రమంలో ఏపీలో ఓ గ్రామ వాలంటీర్ ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మోస పోయిన ఆ యువతి న్యాయం కోసం పోరాడుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
కడప జిల్లా కాశినాయన మండలంలో ఓ యువతిని మోసం చేసి ప్రియుడు పరారైన ఘటన చోటుచేసుకుంది. మాచవరం చెన్నారెడ్డి, ఓ అమ్మాయి వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరు కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాల్లో తెలియగా వారు ఇద్దర్ని మందలించారు. ఈ క్రమంలో ఆ అమ్మాయికి పెళ్లి చేసేందుకు ఓ పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకున్నారు ఆమె తల్లిదండ్రులు.
కాగా ఆ పెళ్లి సంబంధాన్ని చెడగొట్టిన చెన్నారెడ్డి అమ్మాయిని తీసుకుని బెంగళూర్ వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు మళ్లీ తీసుకొచ్చి ఇంటి దగ్గర ఆ యువతిని దించేసి వెళ్లాడు. ప్రియుడితో వెళ్లిన కూతుర్ని ఇంట్లోకి రానివ్వలేదు ఆ యువతి తండ్రి. దీంతో ప్రియుడు చెన్నారెడ్డికి ఫోన్ చేయగా స్విఛ్ ఆఫ్ రావడంతో ఆ అమ్మాయి చెన్నారెడ్డి ఇంటిముందు నిరసనకు దిగింది. మోసానికి పాల్పడిన ప్రియుడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ పేరుతో మోసం చేసిన వాలంటీర్
కడప జిల్లా కాశినాయన మండలంలో మాచవరం చెన్నారెడ్డి, అమ్మాయి (22) వాలంటీర్లుగా పనిచేస్తున్న వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదరగా చెన్నారెడ్డి పెళ్లి చెడగొట్టి అమ్మాయిని సోమవారం బెంగుళూర్ తీసుకువెళ్లాడు.
బుధవారం తిరిగి… pic.twitter.com/HK3IpuHUOV
— Telugu Scribe (@TeluguScribe) August 17, 2023