దేశవ్యాప్తంగా ప్రజలు హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా బహిరంగ వేడుకలకు అనుమతి లేకపోవడంతో హోలీ కళ తప్పింది. కానీ ఈ ఏడాది ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో ప్రజలు ఎంతో సంబరంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. వరసయ్యే వారికి, స్నేహితులకు రంగులు పూస్తూ.. మిఠాయిలు పంచుకుని పండుగ చేసుకున్నారు. ఇక హోలీ అంటే ఎక్కడైనా సరే రంగులు పూసుకోవడం, నీళ్లు చల్లుకోవడం చేస్తారు. మరికొందరు ఆయిల్, గ్రీజు, కుదిరితే కోడిగుడ్లు కొట్టడం చేస్తారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త మాత్రం వేరే లెవెల్ ది.
ఇది కూడా చదవండి: హూలీ సంబరాలు.. జగ్గారెడ్డి మాస్ డ్యాన్స్! వీడియో వైరల్
హోలీ నాడు కొందరు యువకులు చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఏకంగా స్నేహితుడిని తీసుకెళ్లి డ్రైనేజీ కెనాల్‌లో పడేశారు. కొందరు యువకులు కలిసి.. ఒక వ్యక్తిని పట్టుకుని.. బ్రిడ్జీ మీద నుంచి డ్రైనేజీ కెనాల్లోకి విసిరేశారు. ఈ వీడియో చూసిన జనాలు.. మీ పిచ్చి పాడుగాను.. అతడికి జీవితం మీద విరక్తి కలిగించారు కదరా నాయనా.. అయినా ఇదేం దరిద్రం.. ఇంత చండాలంగా హోలీ ఆడతారా అని ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తున్నారు నెటిజనులు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.