దేశమంతటా హోలీ సెలబ్రేషన్స్ అంబరాన్నంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు, టాలీవుడ్ టూ బాలీవుడ్ వరకూ పలువురు హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలు హోలీ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. రంగులతో ఆడుతూ, నీటి బిందువుల మధ్య కేరింతలు కొట్టారు. ఇందుకు తాము దూరం కాదంటూ భారత క్రికెటర్లు తమదైన శైలిలో హోలీ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ, పాటలు పాడుతూ, డాన్స్‌లతో చిందేస్తూ.. చాలా హుషారుగా కనిపించారు.
భారతదేశ వ్యాప్తంగా మంగళవారం(మార్చి 7) హోలీ వేడుకలను దేశ ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. టీమిండియా ఆటగాళ్లు సైతం హోలీ సెలబ్రేషన్స్ ను డ్యాన్స్ లతో, అరుపులతో, రంగులు చల్లుకుని జరుపుకున్నారు. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్ల హోలీ సెలబ్రేషన్స్ వీడియో వైరల్ గా మారింది.
దేశవ్యాప్తంగా ప్రజలు హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా బహిరంగ వేడుకలకు అనుమతి లేకపోవడంతో హోలీ కళ తప్పింది. కానీ ఈ ఏడాది ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో ప్రజలు ఎంతో సంబరంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. వరసయ్యే వారికి, స్నేహితులకు రంగులు పూస్తూ.. మిఠాయిలు పంచుకుని పండుగ చేసుకున్నారు. ఇక హోలీ అంటే ఎక్కడైనా సరే రంగులు పూసుకోవడం, నీళ్లు చల్లుకోవడం చేస్తారు. మరికొందరు ఆయిల్, గ్రీజు, కుదిరితే కోడిగుడ్లు కొట్టడం చేస్తారు. […]
దేశ వ్యాప్తంగా నేడు హూలీ సంబురాలు ఘనంగా జరుపుకుంటున్నారు. గత రెండేళ్లుగా కరోనా ప్రభావంతో హూలీ పండుగ పెద్దగా జరుపుకోలేదు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడంతో ప్రజలు బయటకు వచ్చి ఆనందంగా హూలీ వేడుకలు జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చిన్నా.. పెద్ద అనే తేడా లేకుండా రంగుల్లో మునిగిపోయారు. సినీ, రాజకీయ నేతలు సైతం హూలీ సంబురాల్లో మునిగిపోయారు. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దూందాం స్టెప్పులు వేశారు. యువతతో కలిసి కేరింతల మధ్య హల్‌చల్ చేశారు. […]