మగాళ్లతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువ తింటాఋ. ఎవరైనా చూస్తున్నప్పుడు చేతి వేలి గోర్లతో తినే అమ్మాయిలు.. ఎవరూ లేకపోతే మాత్రం విపరీతంగా తింటారు. మగాళ్లు కూడా ఎక్కువే తింటారు. కానీ ఆడవారు మగాళ్లతో పోలిస్తే ఎక్కువ తింటారట. దీనికి 3 సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి.
అమ్మాయిలు ఎప్పుడూ తింటూనే ఉంటారని కామెంట్స్ చేస్తుంటారు. అయితే మగాళ్ల బుర్ర తినడం లేదా స్నాక్స్ తినడం.. ఇవి తప్ప అమ్మాయిలకి వేరే ప్రపంచం తెలియదు అని కామెంట్స్ చేస్తుంటారు. అయితే ఒక అమ్మాయి ఇలా తినాలి అని అనుకోవడం వెనుక తినాలి అన్న తీవ్రమైన కోరిక ఉంటుందట. ఇదొక సైకలాజికల్ డిజైర్ అని చెబుతున్నారు. సగటున తినే మగవారి కంటే ప్రతి రోజూ 15.6 శాతం ఎక్కువ ఫుడ్ ఆడవారు తింటారు. మగవారు ఒకసారి లంచ్ చేస్తే ఎక్కువ తింటారు. కానీ అదే లంచ్ ని ఆడవారు బిట్ బిట్లుగా తింటారు. ఒకసారి లంచ్ లో ఎక్కువ తినరు, తినలేరు. అందుకే వారికి ఆకలి వేస్తుంటుంది.
మామూలుగా ఎవరైనా ఒత్తిడికి లోనైతే ఆ ఒత్తిడిని అధిగమించడానికి మెదడు కార్టిసాల్ ని స్రవించమని అడ్రినల్ గ్రంథులకు చెబుతుంది. కార్టిసాల్ స్రవించడం కోసం అమ్మాయిలను ఎక్కువగా తినేలా ప్రేరేపిస్తుంది. ఒకసారి తిన్నా కూడా ఇంకా ఏదైనా తినాలి అని ఆలోచించేలా చేస్తుంది. ఇదే ఒత్తిడిని అధిగమించడానికి కార్టిసాల్ స్రవించడం కోసం మగవారు అయితే సిగరెట్, మద్యం సేవిస్తారు.
ఒకసారి తినాలి అని ఫిక్స్ అయితే ఏం తిన్నా గానీ నాది బాధ్యత అని మెదడు అనుకుంటుందట. తినాలన్న ప్రవర్తనను మేనేజ్ చేయడానికి మెదడు యాక్టివేట్ అవుతుంది. కేకులు, పీజ్జాలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారం వంటివి చూసినప్పుడు ఆడవారికైనా, మగవారికైనా మెదడు బలంగా స్పందిస్తుంది. అయితే ఆడవారి విషయంలో మాత్రం ఒక కొత్త ప్రపంచానికి తలుపులు తెరవబడ్డాయి అన్నట్టుగా మెదడు ఆలోచిస్తుంది. లోపల మెదడు మొత్తం మెరిసిపోతుంటుంది. అదే అబ్బాయి మెదడు అయితే దొరికింది కదా అని పెద్దగా స్పందించదట.
రుతుస్రావం సమయంలో ఈస్ట్రోజన్ అనేది ఆడవారిలో డైల్యూటెడ్ యాపిటైట్ లా పని చేస్తుంది. ఇది విపరీతమైన ఆకలికి దారి తీస్తుంది. రుతుస్రావం సమయంలో మొదటి కొన్ని రోజులప్పుడు ఈస్ట్రోజన్ స్థాయిలు పడిపోతుంటాయి. ఈస్ట్రోజన్ స్థాయిలు పడిపోవడం వల్ల డైల్యూటెడ్ యాపిటైట్ అనేది డెవలప్ అవుతుంది. ఇది తినాలి అన్న ఆలోచనను ప్రేరేపిస్తుంది. ఇదే సమయంలో స్వీట్లు తినడానికి ఇష్టపడతారు. శారీరకంగా బలహీనంగా ఉండడం వల్ల తినాలి అన్న కోరిక పుడుతుంది. తింటేనే వారు మళ్ళీ బలంగా తయారవ్వగలరు.
అలానే కొన్ని పరిశోధనల ప్రకారం 90 శాతం పెళ్లి కాని అమ్మాయిలు ఫుడ్ ప్రేమికులని తేలింది. అది వీళ్ళు ఫుడ్ ని ప్రేమిస్తే అబ్బాయిలని ప్రేమించడానికి స్పేస్ ఎక్కడుంటుంది చెప్పండి. పానీ పూరీ ఇరుక్కు, పావు బాజీ ఇరుక్కు, ఐస్ క్రీమ్ ఇరుక్కు, స్వీట్లు ఇరుక్కు, హాట్ ఇరుక్కు.. అన్నీ ఇరుక్కు. అడిదా అమ్మాయి మనసు ఇరుక్కు అని అనుకుంటున్నారా? అంతేగా మరి. ఇవే మగవారితో పోలిస్తే ఆడవారు ఎక్కువగా తినాలి అని అనుకోవడానికి కారణాలు. ఇవి కాకుండా వేరే ఏమైనా కారణాలు మీకు తెలిసినవి ఉంటే కామెంట్ చేయండి.