రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు రహదారి పక్కన మైలురాళ్లు కనిపిస్తాయి. ఇవి వివిధ రంగుల్లో ఎందుకు ఉంటాయో అని ఎప్పుడైనా అనిపించిందా?
మైలురాయి అనేది మనం ఊతపదంలా వాడుతుంటాం. అయితే ఇదే మైలురాయి రహదారి పక్కన కనబడుతుంది. రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు పక్కన మైలురాళ్ళు గమనించే ఉంటారు. మైలురాయి అనేది ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతం ఎంత దూరంలో ఉంది అనేది తెలియజేస్తుంది. అయితే ఇందులో వివిధ రంగులతో కూడిన మైలురాళ్ళు ఉంటాయి. ఇవి వివిధ రంగుల్లో ఎందుకు ఉంటాయో అనేది చాలా మందికి తెలియదు. జాతీయ రహదారులకు ఒక రంగు, రాష్ట్ర రహదారులకు ఒక రంగు, స్ట్రీట్ లేన్స్, హైవేలకు గ్రామాలు కనెక్ట్ అయి ఉంటే ఒక రంగు.. ఇలా ఒక్కో దానికి ఒక్కో రంగుతో కూడిన మైలురాయి అనేది ఉంటుంది. మరి ఏ రంగు ఏ రహదారిని సూచిస్తుందో తెలుసుకోండి.
కింద తెలుపు రంగు ఉండి, పైన ఆకుపచ్చ రంగు ఉంటే అది జాతీయ రహదారి అని అర్థం. అంటే మీరు జాతీయ రహదారి మీద ఉన్నారని తెలియజేస్తుంది. రాష్ట్ర రహదారి మీద ఉన్నట్టు కాదు. ఈ రోడ్డు నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అయి ఉంటుంది.
రోడ్డు పక్కన నలుపు, నీలం, తెలుపు రంగుతో కూడిన మైలురాళ్ళు కనబడితే గనుక అవి ప్రధాన నగరం లేదా జిల్లా రహదారిని సూచిస్తాయి. అంటే మీరు ఫలానా నగరంలో గానీ ఫలానా జిల్లాలో గానీ అడుగుపెట్టారని తెలియజేస్తాయి. వీటిని రాష్ట్ర, జిల్లా అధికారులు సంయుక్తంగా మరమ్మత్తులు చేస్తారు.
రోడ్డు పక్కన నారింజ రంగు మైలురాయి కనిపిస్తే.. దీనర్థం మీరు ఒక గ్రామీణ రహదారిపై ప్రయాణం చేస్తున్నారని అర్థం. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద ఈ రోడ్లను నిర్మిస్తారు. ఈ రహదారులను నిర్వహణ బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంటుంది.
రహదారి పక్కన కింది భాగం తెలుపు రంగులో, పై భాగం పసుపు రంగులో ఉంటే గనుక జాతీయ రహదారి మీద ప్రయాణం చేస్తున్నట్లు తెలియజేస్తుంది. ఈ రహదారిని కేంద్ర ప్రభుత్వమే నిర్మించిందని అర్థం. అలానే దాని పర్యవేక్షణ బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానిదే అని తెలియజేస్తుంది.