SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » unknown facts » Do You Know Talapatra Grandhalu Made With Srithala Tree Leaves

తాళపత్రాలంటే తాటి ఆకులు కాదు.. అవి అరుదైన చెట్ల ఆకులని మీకు తెలుసా?

  • Written By: Nagarjuna
  • Published Date - Fri - 3 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తాళపత్రాలంటే తాటి ఆకులు కాదు.. అవి అరుదైన చెట్ల ఆకులని మీకు తెలుసా?

తాళపత్ర గ్రంథాల గురించి తెలిసే ఉంటుంది. కాగితం లేని సమయంలో జ్ఞాన సంపదను ముందు తరాలకు అందించడానికి తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తం చేసేవారు మన ఋషులు, మహర్షులు, పూర్వీకులు, కవులు. పురాణాల్లోనూ, ఇతిహాసాల్లోనూ, వేదాల్లోనూ ఎన్నో ఆచారాలు, విశ్వాసాలు, ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచేవారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా ఎలా అయితే ఉన్నదో.. అప్పుడు ఈ తాళపత్ర గ్రంథాలే మాధ్యమాలుగా ఉండేవి. మనిషి నుంచి మనిషికి విలువైన, ముఖ్యమైన సమాచారాన్ని చేరేవేసేందుకు ఉపయోగించేవారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం సహా అనేక పురాతన గ్రంథాలన్నీ తాళపత్రాల్లోనే నిక్షిప్తం చేశారు. చాలా వరకూ తాళపత్ర గ్రంథాలు కనిపించకుండా పోయాయి.

ఉన్నవాటిలో ఇప్పటికీ ఆ పత్రాల మీద రాసిన అక్షరాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. కొన్ని వందల ఏళ్ళు చెక్కు చెదరకుండా ఉండే పత్రాలను తాటి చెట్ల నుంచి సేకరించేవారని అనుకుంటారు. కానీ నిజానికి అవి తాటి చెట్టు నుంచి సేకరించిన ఆకులు కాదు. తాళపత్రాలు చూడ్డానికి తాటి ఆకులతో చేసినట్టు కనిపిస్తాయి. చాలా మంది తాళపత్ర గ్రంథాలు అంటే తాటి ఆకులతో చేసినవే అని అనుకుంటారు. అయితే మీకు తెలుసా? తాళపత్రాలు తాటి ఆకులతో చేసినవి కాదని. అది తాటి చెట్టు కాదు. తాళపత్ర వృక్షం. శ్రీతాళం అనే చెట్టు పత్రాలను తాళపత్రాలుగా ఉపయోగించేవారు. ఈ పత్రాల మీదనే పూర్వం గ్రంథాలు రచించేవారు. వాటినే తాళపత్ర గ్రంథాలు అనేవారు. శ్రీతాళం చెట్ల ఆకులను సేకరించి, వాటిని ఎండబెట్టి.. క్రమపద్ధతిలో గుచ్చి తాళపత్రాలను సిద్ధం చేసేవారు.

do-you-know-talapatra-grandhalu-made-with-srithala-tree-leaves

శ్రీతాళం చెట్టు కూడా తాటి చెట్టు లానే ఉంటుంది. పువ్వు పూసి, కాయలు కాసాక చెట్టు చనిపోతుంది. అయితే ఈ చెట్లు పూర్తిగా అంతరించిపోయాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు శ్రీలంకలో ఎక్కువగా ఉండేవి. అయితే కాలక్రమేణా ఈ చెట్లు అంతరించిపోయాయి. కేరళలో కొన్ని చెట్లు ఉన్నట్లు సమాచారం. అయితే రెండేళ్ల క్రితం గుంటూరు జిల్లాలోని నారాకోడూరు గ్రామంలో శ్రీతాళం చెట్టు ఉన్నట్లు గుర్తించారు వృక్ష శాస్త్ర నిపుణులు. అప్పటి వరకూ దాన్నొక తాటి చెట్టుగా చూసిన గ్రామస్తులు.. ఒక ప్రొఫెసర్ చెప్పడంతో తాళపత్ర వృక్షం అని తెలుసుకున్నారు. చెట్టు శిఖర భాగంలో పూలగుత్తులు రాలిపోవడం, కొద్ది రోజుల్లోనే అది పొడవుగా పెరిగి అందంగా కనిపించడం మొదలైంది.

ఆ తర్వాత ఆకులన్నీ ఎండిపోయి.. చెట్టు పూర్తిగా వాడిపోయింది. పూలగుత్తులు లేత పసుపు రంగులోకి మారాయి. ఆ తర్వాత ఆ చెట్టు కాయలు నేలరాలాయి. అయితే దాన్ని పరిశీలించిన స్థానిక వ్యవసాయ శాస్త్రవేత్తలు జన్యులోపం వల్ల అలా జరిగిందని చెప్పారు. అయితే తమిళనాడులోని అన్నామలై యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ మాత్రం.. ఇది శ్రీతాళం చెట్టు అని గుర్తించారు. దీన్ని సిద్ధ వైద్యంలో కూడా ఉపయోగించేవారని వెల్లడించారు. అదండీ విషయం.. తాళపత్రాలు అనేవి తాటి చెట్ల ఆకులు కాదు.. శ్రీతాళం అనే చెట్టు యొక్క ఆకులు. ఈ ఆకులనే సేకరించి తాళపత్ర గ్రంథాలుగా చేసి.. జ్ఞాన సంపదను అక్షర రూపంలో మన పూర్వీకులు నిక్షిప్తం చేశారు. మరి దీని గురించి ఇంకా ఏమైనా మీకు తెలిసిన విషయాలు ఉంటే నెటిజన్స్ తో పంచుకోండి.

Tags :

  • Palm Tree
  • unknown facts
Read Today's Latest unknown factsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Why Finger Ring: ఉంగరపు వేలికే ఉంగరాన్ని పెట్టుకుంటారు! ఎందుకో తెలుసా?

Why Finger Ring: ఉంగరపు వేలికే ఉంగరాన్ని పెట్టుకుంటారు! ఎందుకో తెలుసా?

  • Unknown Facts: కరెంటు తీగల మీద వాలిన పక్షులకు షాక్ కొట్టదు.. ఎందుకో తెలుసా?

    Unknown Facts: కరెంటు తీగల మీద వాలిన పక్షులకు షాక్ కొట్టదు.. ఎందుకో తెలుసా?

  • Unknown Facts: అరెస్ట్ చేసిన వ్యక్తి ముఖానికి పోలీసులు ముసుగు తొడుగుతారు.. ఎందుకో తెలుసా?

    Unknown Facts: అరెస్ట్ చేసిన వ్యక్తి ముఖానికి పోలీసులు ముసుగు తొడుగుతారు.. ఎందుకో తెలుసా?

  • 16 Digit Number On Debit Card: ఏటీఎం కార్డు మీద ఉండే 16 అంకెలకు అర్ధమేంటో తెలుసా?

    16 Digit Number On Debit Card: ఏటీఎం కార్డు మీద ఉండే 16 అంకెలకు అర్ధమేంటో తెలుసా?

  • Horns In Trains: రైళ్లలో 11 రకాల హారన్స్ ఉపయోగిస్తారు.. ఎందుకో తెలుసా?

    Horns In Trains: రైళ్లలో 11 రకాల హారన్స్ ఉపయోగిస్తారు.. ఎందుకో తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam