ఆంధ్రపద్రేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు. అందరు ఆయనను ప్రేమతో వైఎస్సార్ అని, రాజన్న అని పిలుచుకుంటారు. ఏపీలో కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ ను తనదైన పోరాట పటిమతో 2004లో అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అంతేకాక రెండో పర్యాయం కూడా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చాడు. ఆ తరువాత జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. భౌతికంగా ఆయన దూరమైనప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారు. ఇక ఆయన వారసుడిగా ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ఉన్నారు. అంతేకాక వైఎస్ కుమార్తె షర్మిల కూడా తెలంగాణ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. అయితే షర్మిల రాజకీయ నేపథ్యం గురించి కొన్నేళ్లు వెనక్కి వెళ్లి చూస్తే.. ఆమెలో ఓ పోరాట యోధురాలు కనిపిస్తోంది.
వైఎస్ షర్మిల తెలంగాణాల్లో వైఎస్సాఆర్ టీపీ అనే పార్టీని స్థాపించింది. అయితే ఆమె పార్టీని స్థాపించిన కొత్తలో చాలా మంది రాజకీయ విశ్లేషకులు పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. మరికొందరు అయితే ఆమెను చూసి నవ్వుకున్నారు. అయితే సోమవారం వరంగల్ జిల్లా నర్సన్నపేటలో జరిగిన ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రజలు షర్మిల వైపు చూశారు. అక్కడ ఆమె చేస్తున్న ప్రజాప్రస్థానం పాదయాత్రను కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అంతేకాక ప్రచార వాహనానికి నిప్పటించారు. మంగళవారం షర్మిల సోమాజిగూడ నుంచి ప్రగతి భవన్ వెళ్లేందుకు ప్రయత్నించింది. ఆమెను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ రెండు రోజుల్లో జరిగిన పరిణామాలతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు షర్మిల వైపు చూశారు. ఓ ఆడ బిడ్డా..రాజకీయాల్లో ఇంత ధైర్యంగా నిలబడ్డటం పట్ల అభినందిస్తున్నారు. అయితే షర్మిలలోని పోరాట పటిమ గురించి తెలియాలంటే ఆమె రాజకీయ జీవితాన్ని కొన్నేళ్లు వెనక్కి వెళ్లి చూస్తే అర్ధమౌతుంది.
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తండ్రి పేరుతో కొత్త పార్టీ పెట్టి.. రాజకీయాల్లోకి అడుపెట్టారు. అయితే అప్పటి ప్రభుత్వం వైఎస్ వారసుడు జగన్ పై అక్రమాస్తుల కేసులు పెట్టి.. దాదాపు కొన్ని నెలల పాటు జైల్లో ఉంచింది. ఆ సమయంలో వైఎస్ అభిమానులంతా తీవ్ర నిరాశలో మునిగిపోయారు. జగన్ జైలుకి వెళ్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని చాలా మంది అప్పటి కాంగ్రెస్ నాయకులు భావించారు. ఆనాడు వైఎస్ కుటుంబ అంతా రోడ్డుపై ఉండిపోయింది. ఆ ఘటన చూసిన ప్రతి వైఎస్సార్ అభిమానికి కంట వెంటనీరు ఉప్పొంగింది. ఇక వైసీపీ పార్టీని ఎలా కాపాడుకునేది అనే సందేహం ప్రతి ఒక్కరిలో కలిగింది. అదే సమయంలో వచ్చింది.. పులివెందుల పులిబిడ్డ, జగనన్న వదిలిన బాణం వైఎస్ షర్మిల. జగన్ జైళ్లులో ఉన్నని రోజులు పార్టీని కాపాడుతూ వచ్చింది. జగన్ మోహన్ రెడ్డి తరపున ప్రచార బాధ్యతలను తాను తీసుకుని ప్రజలకు మరింత చేరువయ్యారు.
రాజశేఖర్ రెడ్డిపై, వైఎస్సార్ సీపీపై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని, నమ్మకాన్ని సడలకుండా చేసింది. ఫ్యాన్ గుర్తు గాల్లో కలిసిపోకుండా నిత్యం ప్రజల్లో నిలబడింది. 2012 – 2013 సంవత్సరాల కాలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రకు “మరో ప్రజా ప్రస్థానం” అనే పేరు పెట్టారు. ఈ పాదయాత్ర 16 జిల్లాలగుండా 9 నెలలకు పైగా కొనసాగింది. ఇందులో 116 నియాజకవర్గాలు, 9 కార్ఫోరేసన్లు, 45 మున్సిపాలిటిలు, 195 మండలాల మీదుగా షర్మిల పాదయాత్ర కొనసాగిందించారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,112 కి.మీ పాదయాత్ర చేసి ప్రపంచంలో ఇంత దూరం పాదయాత్ర జరిపిన మొట్టమొదటి మహిళ షర్మిలా రికార్డు సృష్టించారు. అనంతరం జైలు నుంచి జగన్ మోహన్ రెడ్డి రావడంతో షర్మిల హుందాగా తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అలానే 2019 ఎన్నికలో ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఎలాంటి పదవిని ఆశించలేదు.
జగన్, వైఎస్సాఆర్ సీపీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆమె చూపించిన తెగువ ఇప్పటికి మరచిపోలేము. అందుకే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆమె అడుగుపెట్టినప్పుడు కొందరు విమర్శించిన, మరికొందరు మాత్రం ఆమె చరిత్ర సృష్టిస్తుందని బలంగా నమ్మారు. తెలంగాణాలో రాజకీయాల్లో ఆమె ఉన్నత స్థితికి చేరుతుందా? లేదా పడిపోతుందా? అనే విషయాలు పక్కన పెడితే.. ఆడబిడ్డగా ఆమె పోరాటం అనిర్వచనీయం. రాజకీయాల్లో తాను ఒంటరిని అని తెలిసి కూడా పోరాడేందుకు, ప్రజల ఆశీస్సుల కోసం ముందుకెళ్తుంది. షర్మిల రాజకీయ పోరాట పటిమకు చాలా మంది అభినందనలు తెలుపుతున్నారు. అసలు ఎటువంటి బలం, మద్దతు లేని చోట ఒంటరిగా, మొండిగా పోటి చేయడంపై అందరు ఆశ్చర్యవ్యక్తం చేస్తున్నారు.
రాజశేఖర్ రెడ్డి లోని పోరాట పటిమను, మొండి తననాని వారసత్వంగా పుణికి పుచుకుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. వైఎస్సార్ అభిమానుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. “పులి కడుపున పులే పుడుతుంది. రాజన్న బిడ్డ షర్మిల నిజంగానే పులిబిడ్డ” అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో షర్మిల పాత్ర ఎలా ఉండబోతుందో?