రేసింగ్ అంటూ కొందరు సరదా కోసం చేస్తున్న పనులకు అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. అది వారికి సరదా కావొచ్చు.. కానీ ఇతరుల ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా కార్ రేసింగ్‌కు ఓ నిండు ప్రాణం బలైంది.
డ్రైవింగ్ అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా యువతకు కార్లు, బైక్‌లు నడపడం, అది కూడా వేగంగా తోలడం అంటే చాలా ఇష్టం. అంతవరకు ఓకే, కానీ కొంతమంది యంగ్‌స్టర్స్ తమలో తామే పోటీ పెట్టుకుని బైక్, కార్లను వేగంగా నడుపుతుంటారు. రేసింగ్ ట్రాక్‌లపై నడిపిన మాదిరిగా సాధారణ రోడ్లపై వేగంగా దూసుకెళ్తుంటారు. అయితే ఇలాంటి రేసింగ్స్ వారికి సరదా కావొచ్చు. కానీ రోడ్లపై ప్రయాణించే ఇతర వాహనదారులు, పాదచారులకు మాత్రం ప్రాణసంకటంగా మారుతోంది. ఇలాంటి ఘటనల్లో ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
స్టూడెంట్స్ కార్ రేసింగ్ ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. ఒక బిజినెస్ కళాశాలలో చదువుతున్న కొందరు విద్యార్థులు కార్ల రేసింగ్ పెట్టుకున్నారు. మూడు కార్లలో విద్యార్థులు రేసింగ్‌కు బయలుదేరారు. అయితే వాటిలో ఓ కారు అటు వైపుగా వస్తున్న టూవీలర్‌ను ఢీకొట్టింది. దీంతో బండి మీద ఉన్నవారు రోడ్డుపై పడిపోయారు. వాటిలోని మరో కారు మహిళపై నుంచి దూసుకుపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వివరాలు.. రంగారెడ్డి జిల్లా, శంకర్పల్లి మండలంలోని జన్వాడ గ్రామానికి చెందిన నర్సింహులు, శాంతమ్మ (55) దంపతులు మంగళవారం సాయంత్రం టూవీలర్‌పై శంకర్‌పల్లిలో ఒక బంధువు అంత్యక్రియలకు హాజరై తిరిగివస్తున్నారు.
మీర్జాగూడ గ్రామం, కొల్లూరు గేటు సమీపంలో వారి వెహికిల్‌ను వెనుక నుంచి వచ్చిన కారు వేగంగా ఢీకొట్టింది. వాళ్లిద్దరూ రోడ్డుపై పడిపోయారు. అంతలోనే వెనుక నుంచి వచ్చిన మరో కారు శాంతమ్మపై నుంచి దూసుకుపోయింది. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. గాయపడిన నర్సింహులును ఆస్పత్రికి తరలించారు. కారు నడుపుతున్న సుజిత్‌రెడ్డిని స్థానికులు పట్టుకుని కొట్టారు. రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.