టెక్నాలజీ పెరుగుతుంది.. నిరాక్షరాస్యత తగ్గుతోంది.. సమాజం అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని సంతోషించాలో.. లేక కులం, మతం పేరుతో నేటికి కూడా తన్నుకు చస్తున్నందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితులు ప్రస్తుత సమాజంలో నెలకొని ఉన్నాయి. సోషల్ మీడియా వినియోగం పెరగడంతో.. ఇలాంటి వ్యవహారాలు వెంటనే వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తి.. ముస్లిం వ్యక్తిని మాత్రం డెలివరీ బాయ్‌గా పంపవద్దంటూ రిక్వెస్ట్ చేయడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఆ వివరాలు..
ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తి.. డెలివరీ ఇన్‌స్ట్రక్షన్స్‌లో.. ముస్లిం వ్యక్తి చేత తన ఆర్డర్‌ని డెలివరీ చేయించవద్దని కోరాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ట్యాక్సీ అండ్ డ్రైవర్స్ జేఏసీ ఛైర్మన్ షేక్ సలావుద్దీన్ ఈ స్క్రీన్‌షాట్‌ని షేర్ చేస్తూ.. ఇలాంటి ఘటనలపై స్విగ్గీ చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదని.. గతంలో కూడా ఓ కస్టమర్ ముస్లిం డెలివరీ బాయ్ ఫుడ్ తీసుకొచ్చాడనే కారణంతో ఆర్డర్‌ని రిజెక్ట్ చేశాడని గుర్తు చేశాడు. అంతేకాకుండా సదరు డెలివరీ బాయ్.. ఆహారంస్పైసీగా లేదు..హిందూ డెలివరీ బాయ్‌ను సెలెక్ట్ చేయండి, రేటింగ్స్ దానిపైనే ఆధారపడి ఉంటాయని ప్రస్తావించాడు అని గుర్తు చేశాడు సలావుద్దీన్.
ఈ సంఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఆకలికి మతం ఉంటుందా.. చావుబతుకుల్లో ఉన్నావ్.. గుక్కెడు నీరు దొరికితే ప్రాణం నిలుస్తుంది. అప్పుడు పరాయి మతం వారు సాయం చేస్తే అంగకరించవా.. దానికి బదులుగా ప్రాణం తీసుకుంటావా.. లేదు కదా. ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు పోవాల్సింది పోయి.. ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు.
ఇక గతంలో జొమాటోకు కూఆ ఇదే తరహా అనుభవం ఎదురయ్యింది. ఈ సందర్భంగా జొమాటో సీఈవో దీపేందర్ గోయెల్ సదరు కస్టమర్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇండియా అనే సమాఖ్య స్ఫూర్తికి గర్వంగా ఉందని..మా కస్టమర్లు, భాగస్వామ్యుల్లో భిన్నత్వముందని..మా విలువలకు విఘాతం కల్గించే వ్యాపారం ఉన్నా ఒకటే.. పోయినా ఒకటే అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం స్విగ్గీ కూడా సదరు కస్టమర్ విషయంలో ఇలానే స్పందించాలని సూచిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Dear @Swiggy please take a stand against such a bigoted request. We (Delivery workers) are here to deliver food to one and all, be it Hindu, Muslim, Christian, Sikh @Swiggy @TGPWU Mazhab Nahi Sikhata Aapas Mein Bair Rakhna #SareJahanSeAchhaHindustanHamara#JaiHind #JaiTelangana pic.twitter.com/XLmz9scJpH
— Shaik Salauddin (@ShaikTgfwda) August 30, 2022