అంబర్ పేట్ లో ప్రదీప్ అనే ఐదేళ్ల బాలుడు వీధి కుక్కల దాడి ఘటన మరువకముందే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా కోతుల దాడిలో ఓ 70 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు విడిచింది. అసలేం జరిగిందంటే?
గత కొన్ని రోజుల నుంచి కుక్కలు, కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ అంబర్ పేట్ లో ప్రదీప్ అనే ఐదేళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ స్పందించి సీరియస్ గా తీసుకుని తగు జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్దమైంది. అయితే ఈ ఘటన మరువకముందే తాజాగా కోతుల దాడిలో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. తాజాగా తెలంగాణలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లా రామారెడ్డి ప్రాంతంలో చాతరబోయిన నర్సవ్వ (70) అనే వృద్ధురాలు కుటుంబ సభ్యులతో పాటు నివాసం ఉంటుంది. అయితే ఈ శుక్రవారం ఆమె కుటుంబ సభ్యులు అందరూ ఓ పెళ్లి వేడుకకు బయటకు వెళ్లారు. దీంతో ఇంటి వద్ద నర్సవ్వ ఒంటరిగా ఉండి సాయంత్రం పూట చిన్న చిన్న పనులు చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఓ 20 కోతులు ఆ వృద్ధురాలు ఇంటి ముందుకు వచ్చింది. ఇక వస్తూ వస్తూనే ఆ కోతుల గుంపు నర్సవ్వపై దాడికి పాల్పడ్డాయి. దీంతో నర్సవ్వ సహాయం కోసం అరిచింది. కానీ, ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఆ కోతులు ఆ వృద్ధురాలిని తీవ్రంగా దాడికి పాల్పడి అక్కడి నుంచి పరుగులు తీశాయి.
ఈ దాడిలో నర్సవ్వ తీవ్రంగా గాయపడింది. అదే సమయంలో నర్సవ్వ కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ నర్సవ్వ శనివారం ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై స్పందించిన గ్రామస్తులు ఇది బాధాకరమని అన్నారు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని, ఇకనైన అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. కోతలు దాడిలో తీవ్రంగా గాయపడి చనిపోయిన వృద్దురాలి ఘటనపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.