కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన కన్న తండ్రిని కొట్టి చంపాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. తండ్రిని కుమారుడు ఎందుకు హతమర్చాడు? అసలేం జరిగిందంటే?
తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కన్న తండ్రిని అతి దారుణంగా కొట్టి చంపాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. కొడుకు తండ్రిని ఎందుకు కొట్టి చంపాడు? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పరిధిలోని గాంధారా గ్రామం. ఇక్కడే జడే తుకారం(75), జడే కిషోర్ అనే తండ్రీ కొడుకులు నివాసం ఉండేవారు. తుకారం చాలా ఏళ్ల నుంచి స్థానిక పట్టణంలో వస్త్ర వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. ఇతని కుమారుడు కిషోర్ భార్యాపిల్లలతో హైదరాబాద్ లో ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో ఇతనికి నష్టాలు వచ్చాయి. దీంతో కుమారుడు కిషోర్ ఇటీవల ఇంటికి చేరుకుని తన తండ్రి తుకారంను ఆశ్రయించాడు. ఇదే విషయంపై తండ్రీకొడుకులు గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే.. నా ఇంట్లో ఉండొద్దని తుకారం కొడుకు కిషోర్ ను ఇంట్లో నుంచి గెంటేశాడు. దీంతో కోపంతో ఊగిపోయిన కిషోర్.. తండ్రిని కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన తుకారంను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. అతడు అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు.
అనంతరం కిషోర్ ఏం తెలియదన్నట్లుగా తండ్రి శవాన్ని ఇంటికి తీసుకొళ్లే ప్రయత్నం చేశాడు. కాగా, మృతుడి ముఖంపై కొట్టిన ఆనవాళ్లు ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన తుకారం శవాన్ని పరీశీలించారు. అనంతరం జాగిలాలను తీసుకురాగా అవి మృతుడి కుమారుడి వైపు చూపించాయి. దీంతో పోలీసులు కిషోర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా ఎట్టకేలకు అసలు నిజాలు బయటపెట్టాడు. నేనే నా తండ్రిని కొట్టి చంపానని నేరాన్ని అంగీకరించాడు. ఆ తర్వాత పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఆస్తి వివాదాల్లో కన్న తండ్రిని కొట్టి చంపిన కుమారుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.