ఈ కాలంలో మనుషుల మద్య అనుబంధాలన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయని ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. డబ్బు కోసం ఐనవాళ్లను కూడా చూడకుండా దేనికైనా తెగబడుతున్నారు. తల్లిదండ్రులను అనాథలుగా వదిలివేస్తున్నారు.
సమాజంలో రోజు రోజు కీ మనుషుల మధ్య అనుబంధాలు పూర్తిగా నశించిపోతున్నాయి.. డబ్బు ఉంటేనే గౌరవం, గుర్తింపు అన్న చందంగా సాగుతుంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నట్టు.. దీన్ని నిజం చేశారు ఇద్దరు కూతుళ్లు. తమకు ఆస్తి ఇవ్వలేదని కారణంతో తల్లి మృతదేహాన్ని తమతో తీసుకు వెళ్లడానికి నిరాకరించారు కూతుళ్లు. ఈ అమానవీయ ఘటన కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కామారెడ్డి జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. జిల్లా కేంద్రం లోని ఆర్ బీ నగర్ కాలనీలో కిష్టవ్వ (70) ఇటీవల అనారోగ్యంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు గత నెల 21 న ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కిష్టవ్వ శనివారం రాత్రి మృతి చెందింది. కిష్టవ్వకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ముగ్గురు కూతుళ్లలో ఒక ఒకరు మృతి చెందారు. మృతురాలి పేరుపైన ఒక ఇళ్లు, డిపాజిట్ పేరిట లక్షా పది వేలు ఉన్నాయి. అయితే వీటికి నామినీగా మృతురాలు బంధువు ఒకరు ఉన్నారు. కిష్టవ్వ బతికి ఉండగా ఆస్తి పంపకాలు.. డిపాజిడ్ డబ్బులు ఇవ్వాలని కూతుళ్లు ఎల్లవ్వ, పెంటవ్వలు తల్లిని అడగారు.. ఆమె నిరాకరించడంతో ఆసుపత్రిలోనే వదిలి వెళ్లిపోయారు. దాంతో సిబ్బంది కిష్టవ్వకు సపర్యలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో శనివారం కిష్టవ్వ చనిపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఆసుపత్రికి చేరుకున్న కూతుళ్లు తమ వద్ద డబ్బులు లేవని.. ఆ మద్యనే తమ అక్క చనిపోగా ఖర్చులు పెట్టుకున్నామని అన్నారు. తమకు బ్యాంకులో ఉన్న డబ్బులు ఇప్పిస్తేనే మృతదేహాన్ని తీసుకు వేళ్తామని తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమీ లేక మృతదేహాన్ని సిబ్బంది మార్చురీలోనే ఉంచారు. బిడ్డలు ఉన్నా తల్లి మృతదేహాన్ని అనాథలా వదిలివేయడంతో పలువురు మండిపడ్డారు. ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇద్దరు కూతుళ్లను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎట్టకేలకు కౌన్సిలింగ్ తర్వాత తల్లి మృతదేహాన్ని తీసుకువెళ్తామన్నారు. డబ్బుతోనే ఈ కాలంలో బంధాలు ముడిపడి ఉన్నాయని ఈ ఘటన మరోసారి రుజువు చేసిందని అంటున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.