ఈ మధ్యకాలంలో అధికారులకు, ఆదివాసీలకు, తండా ప్రాంత ప్రజలకు మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. అంతేకాక అటవీ ప్రాంత ప్రజలు.. తమ ప్రాంతానికి వచ్చిన అధికారులపై దాడులు కూడా చేస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది.
ఈ మధ్యకాలంలో అటవీ భూముల విషయంలో అధికారులకు, ఆదివాసీలకు, తండా ప్రాంత ప్రజలకు మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. అంతేకాక అటవీ ప్రాంత ప్రజలు.. తమ ప్రాంతానికి వచ్చిన అధికారులపై దాడులు కూడా చేస్తున్నారు. ఇటివలే ఖమ్మం జిల్లాలో శ్రీనివాసరావు అనే ఫారెస్ట్ ఆఫీసర్ ను ఓ అటవీ తెగ వారు బాణలతో కొట్టి చంపారు. తాజాగా కామారెడ్డి జిల్లాలోని ఓ ప్రాంతంలో తనిఖీకి వెళ్లిన అటవీ అధికారులను తండా వాసులు బంధించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రామం సమీపంలోని అక్కాపూర్ -మైసమ్మ దుర్గమ్మ గుడి దగ్గర సమీపంలో అటవీ భూమి ఉంది. గురువారం ఆ భూమిని స్థానిక ప్రజలు చదును చేస్తున్నారు. అటవీ భూమిని చదును చేస్తున్న విషయం అటవీ అధికారులకు తెలిసింది. అక్కడి ఫారెస్ట్ ను చదును చేస్తుండగా అధికారులు వెళ్లి అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులపై తండా వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురి మధ్య చాలా సమయం వాగ్వాదం జరిగింది. తండా వాసులు కోపంతో అధికారులను బంధించారు. కాసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ ఘటనపై డిప్యూటీ రేంజ్ అధికారి రమేష్ పోలీసుల కు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలు అక్కడ ఉద్రిక్తతలు రావడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అధికారుల, స్థానిక ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. గత కొంతకాలం నుంచి అటవీ అధికారులకు, ఆదివాసీలకు మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో ఖమ్మం జిల్లాలో శ్రీనివాసరావు అనే అటవీ అధికారిని ఓ ఆదివాసీ తెగ బాణలతో కొట్టి చంపేసింది. ఈ క్రమంలో తమ ప్రాణాలకు రక్షణ లేదంటూ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.