ఇటీవల మీమ్ పేజెస్ కి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రక రకాల అంశాలపై ఫన్నీగా, వ్యంగంగా వస్తున్న మీమ్ పేజెస్ సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారుతున్నాయి. ముఖ్యంగా రాజకీయాల్లో ప్రత్యేర్థి పార్టీలపై వస్తున్న మీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు..
సోషల్ మీడియాలో గత కొంత కాలంగా రాజకీయా రంగాలకు సంబంధించిన మీమర్లు ప్రతిరోజూ నవ్వులు పెట్టించే విధంగా మీమ్ పేజెస్ లో షేర్ చేస్తున్నారు. వీటిలో కొన్ని వ్యంగ్యంగా ఉంటే.. కొన్ని నవ్వులు పూయించే విధంగా ఉంటున్నాయి. ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా ఈ మీమ్ పేజెస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. అధికార పార్టీలపై కొంత మంది విపక్షాలు చేసే ఆరోపణలు మీమ్స్ రూపంలో వ్యక్తపర్చడం చూస్తూనే ఉన్నాం.
గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. అధికార పార్టీపై ఏ చిన్న ఛాన్స్ దొరికినా ప్రతిపక్షాలు రక రకాలుగా కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఇందులో మీమ్ పేజెస్ కూడా భాగస్వామ్యం అవుతున్నాయి. అధికార పార్టీపై ప్రత్యర్థి పార్టీలు వ్యంగమైన మీమ్స్ చేయడం సర్వసాధారణం అయ్యింది. సాధారణంగా అధికార పార్టీ ప్రజల్లో తన పాపులారిటీ పెంపొందించుకునేందుకు ఎన్నో రకాల మార్గాలు ఎంచుకుంటాయి. అలాంటి వాటిలో తమ పార్టీ రంగును వాడుకోవడం చూస్తూనే ఉన్నాం. ఏపీలో అధికారంలోకి వచ్చిన వివిధ కట్టడాలు, కార్యాలయాలపై వైసీపీ రంగులు వేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష పార్టీలు ఈ విషయంలో అధికార పార్టీపై ఎన్నో రకాలుగా విమర్శించారు. ఆ అంశంపై ఎన్నో మీమ్స్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి.
ఇప్పుడు తెలంగాణలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఖమ్మంలో 7.5 ఎకరాల్లో సుమారు 23 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఖమ్మం కొత్త బస్టాండ్ కి గులాబీ రంగు వేయడం చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు అధికార పార్టీపై ఎలాంటి విమర్శలు రాలేదు.. కనీసం ఒక్క మీమ్ కూడా కనిపించలేదు.. అదే ఈ స్థాయిలో ఏపిలో జరిగి ఉంటే ఈపాటికి ఎంత రచ్చ అవునో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సాధారణంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజల మన్ననలు పొందాలని.. వారికి తమ పార్టీ గుర్తుండిపోవాలనే ఉద్దేశ్యంతో వివిధ కార్యాలయాలు, వాహనాలపై తమపార్టీ రంగులు వేయడం చూస్తుంటాం. దీన్ని ప్రతిపక్ష పార్టీలు విమర్శించడం సర్వసాధారమైన విషయమే. అయితే తెలంగాణలో అంతే పెద్ద నిర్మాణానికి అధికార పార్టీ రంగు వేయడం పై మీమ్ పేజీలో ఒక్కటి కూడా కానరాలేదు. అదే ఏపిలో అయితే ఈపాటికి రచ్చ రచ్చ అయి ఉండేది అని.. ఈ విషయం తెలుగు మీమ్ పేజెస్ కి కనిపించడం లేదా అని నెటిజన్లు అంటున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
హైటెక్ హంగులు, సకల సౌకర్యాలతో కూడిన అధునాతన ఖమ్మం #TSRTC బస్టాండ్ ఇది. శోభాయమానంగా కనిపిస్తోన్న ఈ బస్టాండ్ ప్రయాణికులకు సరికొత్త అనుభూతులను కలిగిస్తోంది. @puvvada_ajay pic.twitter.com/TicU21gaZM
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) February 12, 2023