ఈ మద్య పలు స్పైస్ జెట్ విమానాల్లో సమస్యలు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. టెకాఫ్ కి ముందో.. టేకాఫ్ అయ్యాకో లేదా ల్యాండింగ్ సమయంలో టెక్నికల్ ఇబ్బందులు రావడంతో ప్రయాణీకులు ప్రాణాలతో చెలగాటం ఆడటం సర్వ సాధారణం అయ్యింది. దీంతో స్పైస్ జెట్ పై విమర్శలు వస్తున్నాయి. తాజాగా గోవా నుంచి హైదరాబాద్ కి వస్తున్న స్పైస్ జెట్ విమానానికి ప్రమాదం తప్పింది. దాదాపు అర్థగంట పాటు విమానంలో పొగలు రాడంతో ప్రయాణీకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చారు. వివరాల్లోకి వెళితే..
గోవా నుంచి హైదరాబాద్ కి బయలు దేరిన స్పైస్ జెట్ SG 3735 విమానంలో టెకాఫ్ అయిన కొద్ది సేపటికే పొగలు కమ్ముకున్నాయి. దీంతో దాదాపు అర్థగంట పాటు విమానం ఆకాశంలో చక్కర్లు కొట్టింది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న 86 మంది ప్రయాణీకులు ఉపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయ్యారు. మొత్తానికి విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు పైలెట్. ఆకాంలో ఉండగా సాంకేతిక లోపం వల్ల విమానంలో పొగలు రావడంతో ప్రయాణీకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రావాల్సి వచ్చింది.
ఆకాశంలో స్పైజ్ జట్ విమానంలో అకస్మాత్తుగా పొగలు కమ్ముకోవడంతో ఒక మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసర ల్యాండింగ్ తర్వాత ఆ మహిళకు వెంటనే ఎయిర్ పోర్ట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. మొత్తానికి సురక్షితంగా విమానం ల్యాండ్ కావడంతో 86 మంది ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి సాంకేతిక లోపం తలెత్తినపుడు దగ్గరలోని ఏదైనా ఎయిర్ పోర్ట్ లో ల్యాండింగ్ చేయకుండా ఇంతసేపు ప్రయాణించడంవల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది గురయ్యారని స్పైస్ జెట్ పై విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.