నేటికాలంలో కొందరు యువకులు జనావాసా ప్రాంతాల్లో శృతిమించి ప్రవర్తిస్తున్నారు. తాము ఏం చేసినా ఎవరు ఏమి అనరులే అన్నట్లు రెచ్చిపోతున్నారు. రైల్వే స్టేషన్లలో , బస్ స్టాప్ ల వద్ద వారి ఆగడాలకు హద్దే లేకుండా పోతుంది. ఎవరైన పొరపాటున ఏంటి? అని ప్రశ్నింస్తే.. వారిపై దాడులకు కూడా తెగబడుతున్నారు. తాజాగా చెన్నై లోకల్ ట్రైన్‌లో కొంతమంది విద్యార్థులు రెచ్చిపోయారు. పదునైనా కత్తులతో ట్రైన్ లో చెలరేగిపోయారు. తాము ఏం చేసినా చెల్లుతుందనుకున్నారో ఏమో ప్రమాదకరమైన కత్తులతో స్టంట్స్ చేశారు. ఇతర ప్రయాణికులకును భయబ్రాంతులకు గురి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు.
కొందరు యువకులు బస్సుల్లో, లోకల్ ట్రైన్లలో, ఇతర ప్రాంతాల్లో వెకిలీ చేష్టాలతో ఇతరలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇక దారుణం ఏమిటంటే కొందరు యువత డ్రగ్స్ సైతం బానిసలవుతున్నారు. పాకెట్ మని కోసం దొంగతనాలకు సైతం కొందరు యువకులు పాల్పడుతున్నారు. మరి కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉండే మహిళల, యువతుల వద్దకు వెళ్లి అసభ్యకరంగా మాట్లాడుతూ రెచ్చిపోతుంటారు. ఇది ఏమిటనే ప్రశ్నించే వారిపై దాడులకు పాల్పడుతున్నారు. అయితే చివరకు జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు. తమిళనాడులోని చెన్నైలో కాలేజీ విద్యార్థులు రెచ్చిపోయారు. తమకు తిరుగు లేదనుకుని.. ఎలాగైనా ప్రవర్తించవచ్చులే అనుకున్నారు. పెద్ద పెద్ద కత్తులతో ట్రైన్‌లో హల్‌చల్ చేశారు. ముగ్గురు యువకులు కత్తులతో ఆడుకుంటూ కనిపించారు. కదులుతున్న లోకల్ ట్రైన్ లో పెద్ద పెద్ద కేకలు వేస్తూ కత్తులతో హల్ చల్ చేశారు. రైలు రన్నింగ్ లో ఫుట్ బోర్డ్ వద్ద నిలబడి ప్లాట్ ఫామ్ పై పదునైన కత్తులను రాపిడి చేస్తూ హంగామా సృష్టించారు.
వారి చేసిన పని తోటి ప్రయాణికులకు భయం పుట్టేలా చేసింది. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి రైల్వే పోలీసులు దృష్టి తీసుకెళ్లారు. 45 సెకన్ల నిడివి గల వీడియో ఫుటేజీలో ముగ్గురు విద్యార్థులుట్రైన్‌లో ప్రయాణిస్తూ పదునైన కత్తులతో ప్రమాదకరమైన స్టంట్ చేశారు. ఫుట్‌బోర్డ్ వద్ద నిలబడి ప్రయాణించడమే రైల్వే చట్టం ప్రకారం నేరం. అలాంటిది ఫుట్ బోర్డుపై నిల్చోని కత్తులతో యువకులు హంగామా చేయడం పై రైల్వే అధికారులు సీరియస్ అయ్యారు. ఆ యువకుల కోసం రైల్వే పోలీసులు గాలించారు. వారు చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాల విద్యార్థులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. వారు చేసిన పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
We would like to inform you that the 3 youths seen in this viral video performing stunts with sharp weapons in their hand, have been arrested by @grpchennai! They are Anbarasu and Ravichandran from Gummidipoondi and Arul from Ponneri. They are all students of Presidency College. pic.twitter.com/3FQVpTWeoW
— DRM Chennai (@DrmChennai) October 11, 2022