మెడికో ప్రీతి కేసు రోజు రోజుకు ఊహించని మలుపుకు తీసుకుంటోంది. ఈ కేసులో తాజాగా వచ్చిన టాక్సికాలజీ రిపోర్ట్ లో కొన్ని నమ్మలేని నిజాలు బయటపడినట్లుగా తెలుస్తోంది. అసలు ఆ రిపోర్టులో ఏముందంటే?
ప్రీతి కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల కారణంగానే ప్రీతి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు సైతం తెలిపారు. అయితే ప్రస్తుతం నిందితుడు సైఫ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఎన్నో అనుమానాలకు తావిస్తున్న ఈ కేసులో పోలీసులు ఆ దిశగా విచారణ చేపడుతు మిగతా జూనియర్ డాక్టర్లను సైతం విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రీతి కేసులో తాజాగా వచ్చిన టాక్సికాలజీ రిపోర్టులో కొన్ని నమ్మలేని నిజాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ కేసులో సీన్ మొత్తం రివర్స్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని పోలీసులు భావిస్తున్నారు. అసలేం జరిగిందంటే
వరంగల్ మెడికో ప్రీతి కేసు రోజు రోజుకు ఊహించని మలుపుకు తీసుకుంటోంది. ఈ కేసులో తాజాగా వచ్చిన టాక్సికాలజీ రిపోర్ట్ ఇప్పుడు వరంగల్ సీపీ రంగనాథ్ చేతికి చేరింది. అయితే ఈ రిపోర్టులో మాత్రం.. ప్రీతి బాడీలో ఎలాంటి విషపదార్థాలు కానీ, హానికరమైన రసాయనాలు ఉన్నట్లుగా కనిపించలేదని అందులో వెల్లడైనట్లుగా తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లుగా ప్రీతి హానికరమైన ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుందని అందరూ అనుకుంటుంటే.. తాజాగా వచ్చిన టాక్సికాలజీ రిపోర్టులో అవేం లేవంటూ కనిపిస్తుండడంతో ఈ కేసు ఊహించని మలుపుకు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుందని పోలీసులు భావిస్తున్నారు.
ఇకపోతే ప్రీతి హానికరమైన ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుందని అందరూ భావిస్తున్నారు. కానీ, ప్రీతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మాత్రం.. ప్రీతిది ఆత్మహత్య కాదని, దీని వెనకాల ఏది జరగిందంటూ ఆరోపణలు లేవనెత్తారు. దీంతో తాజాగా వచ్చిన టాక్సికాలజీ రిపోర్టు కూడా వీరి ఆరోపణలకు బలాన్ని చేకూర్చినట్లుగా అవుతోంది. కాగా, ప్రీతి తల్లిదండ్రుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ముందుగా మిగతా జూనియర్ డాక్టర్లను కూడా ప్రశ్నిస్తూ అసలు నిజాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా వచ్చిన టాక్సికాలజీ రిపోర్టులో ఊహించిన నిజాలు ఉన్నాయని తేలడంతో ప్రీతిది ఆత్మహత్యనా.. లేక హత్యనా అనేది ఎటు తేల్చలేక పోలీసులు తలల పట్టుకుంటున్నారు.
ఇకపోతే తాజాగా వచ్చిన టాక్సికాలజీ రిపోర్టు ఆధారంగా వరంగల్ పోలీసులు తెలంగాణ డీజీపీతో మాట్లాడనున్నారని సమాచారం. అసలు నిజంగానే ప్రీతి బాడీలో ఎలాంటి హానికరమైన పదార్థాలు కనిపించలేదా.. ఇంతకు ప్రీతిని ఎవరైన హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అనే కోణంలో కూడా పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. తాజాగా వచ్చిన టాక్సికాలజీ రిపోర్టులో పలు అనుమానాలకు తావు ఇస్తుండడంతో మందు ముందు ఈ కేసుపై పోలీసులు ఎలాంటి ప్రకటన చేస్తారనేది కాస్త ఆసక్తిగానే మారింది. ఇంతకు ప్రీతిది హత్మనా లేక ఆత్మహత్యనా అనేది తెలయాలంటే పోలీసుల నుంచి అధికారికంగా వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.