జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారం వాహనం వారహికి ప్రత్యేక పూజలు చేసేందుకు.. కొండగట్టు ఆలయానికి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పవన్ తెలంగాణ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. పవన్ కాన్వాయ్‌ను ఫాలో అయిన యువకులు కొందరు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ యాక్సిడెంట్‌లో ఓ యువకుడి మృతి చెందగా.. మరో ముగ్గురురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించేందుకు కొండగట్టు వచ్చిన పవన్ కళ్యాణ్.. పూజ కార్యక్రమాలు ముగిసిన తర్వాత.. అనంతరం ధర్మపురి వెళ్లారు. పవన్ తన పర్యటన ముగించుకుని.. హైదరాబాద్ వస్తుండగా.. కొందరు యువకులు పవన్ కాన్వాయ్‌ను ఫాలో అయ్యారు.
ఈ క్రమంలో తమ అభిమాన నేతకు అభివాదం చేస్తుండగా రెండు బైకులు ఢీకొనడంతో నలుగురు యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ యువకుడి తలకు తీవ్ర గాయం కావడంతో దుర్మరణం చెందాడు. మరో ముగ్గురు యువకులకు గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన యువకుడి మృతదేహాన్ని ధర్మపురి ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
పవన్ కళ్యాణ్ మంగళవారం (జనవరి 24) ఉదయం కొండగట్టు ఆలయాన్ని దర్శించుకున్నారు. అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన ప్రచార రథం ‘వారాహి’కి పూజలు నిర్వహించారు. వేదపండితుల శాస్త్రోక్త పూజల అనంతరం వారాహి రథాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ప్రచార రథం ఎక్కి, దానిపై నుంచి తొలి ప్రసంగం చేశారు. పోతులపై కూడా క్లారిటీ ఇచ్చాడు పవన్. కొండగట్టు టూర్‌లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.