వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కోరి వివాదాల్లో తల దూర్చడం అంటే ఆర్జీవీకి మహా సరదా. మొన్నటి వరకు ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై వరుస ట్వీట్లు చేస్తూ బిజీగా ఉన్న ఆర్జీవీ.. తాజాగా తెలంగాణ మంత్రులను టార్గెట్ చేశారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని టార్గెట్ చేశారు వర్మ. ఎందుకో తెలియాలంటే ఇది చదవండి.
ఇది కూడా చదవండి : టీఆర్‌ఎస్ మంత్రికి కొండా సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్
ప్రస్తుతం వర్మ కొండా మురళి-సురేఖ దంపతులపై కొండా సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సవం రోజున ఈ సినిమా ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమా తీస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి టీఆర్‌ఎస్ ఎంపీ ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని వర్మ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొండా ట్రైలర్ కు ముందు రోజు సురేఖ చేత ఎర్రబెల్లి దయాకర్ రావుకు వార్నింగ్ ఇప్పిస్తూ ఓ వీడియోని తన ట్విటర్ లో షేర్ చేశారు ఆర్జీవీ.
Anni saarlu repeatedgaa cheptha vunte nijam kaadhemo ani anipisthandhi ..Watch KONDA film TRAILER , https://t.co/pNrxi7JQvO pic.twitter.com/nLJ3QDP8gv
— Ram Gopal Varma (@RGVzoomin) February 1, 2022
ఇది కూడా చదవండి : మరోసారి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసిన RGV!
తాజాగా మరోసారి మంత్రి ఎర్రబెల్లికి ఆర్జీవీ షాక్ ఇచ్చాడు. గతంలో ఎర్రబెల్లి మాట్లాడిన ఓ వీడియోని తన ట్విటర్ లో షేర్ చేశారు. ఎర్రబెల్లి.. టీడీపీలో మంత్రిగా ఉన్న సమయంలో తీసిన వీడియో ఇది. దీనిలో ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ‘‘ఒక తల్లికి, తండ్రికి పుట్టినవాడు పార్టీలు మారడు. మంత్రి పదవి కోసం అసలు పార్టీ మారను’’ అని వ్యాఖ్యానించాడు. అయితే ప్రస్తుతం ఎర్రబెల్లి టీడీపీ నుంచి టీఆర్‌ఎస్ లో చేరడమే కాక.. మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీనికి కౌంటర్ గానే ఆర్జీవీ ఈ వీడియోని షేర్ చేశారని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.