దేశంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఏఐసీసీ కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ భారత్ జోడో పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. కర్ణాటకలో ఆయన పాదయాత్ర ముగించుకొని ఏపీలో కొనసాగించారు. ప్రస్తుతం రాహూల్ గాంధీ తెలంగాణలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. నిన్నటి వరకు రాహూల్ గాంధీ పాదయాత్ర హైదరాబాద్ లో సాగింది.. ప్రస్తుతం ఆయన రంగారెడ్డి జిల్లాకు చేరుకున్నారు. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపుతున్నారు. భవిష్యత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా కృషి చేయాలని నేతలకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
రాహూల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర సందర్భంగా జనాలతో మమేకమవూతూ.. పిల్లలతో ఆడుతూ.. ప్రతి ఒక్కిరనీ ఆప్యాయంగా పలకరిస్తూ.. ఒక కామన్ మ్యాన్ అందరితో కలిసిపోతూ సాగించే పాదయాత్రకు మంచి స్పందన లభిస్తుంది. అంతేకాదు రాహూల్ గాంధీ పాదయాత్రలో కొన్ని ఇట్రెస్టింగ్ సన్నివేశాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా సంగారెడ్డి పాత బస్టాండ్ వద్ద బుడగజంగాల సంఘం నుంచి స్వాగతం లభించింది.
బుడగజంగాల వద్ద ఉన్న కొరడా తీసుకొని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొట్టుకున్నారు.. అది చూసి జగ్గారెడ్డి దగ్గర నుంచి రాహూల్ గాంధీ కొరడా తీసుకొని పోతురాజు మాదిరిగా కొట్టుకున్నాడు. ఇది చూడటానికి చుట్టుపక్కల జనాలు ఎగబడ్డారు. తర్వాత కొంతమంది పిల్లలు చేసిన మార్షాల్ ఆర్ట్స్ ప్రదర్శన తిలకించారు. రాహూల్ గాంధీ మధ్యాహ్నభోజనం అనంతరం 4 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు సమాచారం.
Congress MP Rahul Gandhi with Booda Jangapollu community at Sangareddy joined by Cong MLA Jaggareddy during his Bharat Jodo Yatra. @XpressHyderabad @NewIndianXpress @Kalyan_TNIE @madhavitata @balaexpressTNIE pic.twitter.com/J8Uy2q87lD
— R V K Rao_TNIE (@RVKRao2) November 3, 2022
మార్షల్ ఆర్ట్స్ గురువు తో శిష్యుడు…#BharatJodoYatra pic.twitter.com/GohwzOT1Eg
— Telangana Congress (@INCTelangana) November 3, 2022