ఇటీవల రాజకీయ రంగానికి చెందిన పలువురు నేతలు కన్నుమూడయంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. పార్టీ కార్యకర్తలు, అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు.
ఇటీవల సినీ, రాజకీయాల్లో రంగాల్లో పలు విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. నటీనటులు, దర్శక-నిర్మాతలు, రాజకీయ నాయకులు చనిపోతే వారి కుటుంబ సభ్యులే కాదు.. వారిని ఎంతగానో అభిమానించే అభిమానులు, పార్టీ కార్యకర్తలు శోక సంద్రంలో మునిగిపోతుంటారు. తెలంగాణ రాజకీయాల్లో తనదైన మార్క్ చాటుకొని, మంత్రి హోదాలో ప్రజలకు సేవ చేసి.. సీనియర్ కాంగ్రెస్ నేత చిలుకూరి రామచంద్రా రెడ్డి తుదిశ్వాస విడిచారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. ఇటీవల ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ఆక్కడ ఆయన చికిత్స పొందుతూ గురువారం గుండెపోటు రావడంతో రామచంద్రారెడ్డి తుది శ్వాస విడిచారు. రామచంద్రా రెడ్డి ఆదిలాబాద్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేరుమల్లి జనార్థన్ రెడ్డి కేబినెట్ లో మార్కెటింగ్, గిడ్డంగుల శాఖా మంత్రిగా పనిచేశారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు.
మొదటి నుంచి ఎలాంటి కాంట్రవర్సీల జోలికి పోకుండా తన పని తాను చేసుకుంటూ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకుసాగారు చిలుకూరి రామచంద్రారెడ్డి. తాజాగా ఆయన మరణ వార్త తెలియగానే కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ నేతలే కాదు.. ఇతర పార్టీ నేతలు, పలువురు ప్రముఖులు చిలుకూరి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తలిపారు. ఆయన అంత్యక్రియలు స్వగ్రామం కోదల్ లో శుక్రవారం జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.