కోతులను చూస్తేనే కొంత మందికి దడ పుడుతుంది. అలాంటి కోతులు వందలాదిగా గ్రామంలోకి గ్రూపులుగా చేరి గ్రామం మీదకు దండెత్తాయి. ఇక ఇంతటితో ఆగకుండా బాహుబలి రేంజ్ లో సైతం ఫైటింగ్ కూడా చేశాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడలో చోటు చేసుకున్న ఈ కోతుల గ్రూప్ వార్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. అయితే ఆడవి నుంచి వందల సంఖ్యలో కోతులు గుంపులు గుంపులుగా గ్రామంలోకి చేరి రచ్చ రచ్చ చేశాయి.
ఇక రావడమే కాకుండా గ్రామంలోని ఇళ్లపైకి ఎక్కి, రోడ్లలపై తిరుగుతూ నానా బీభత్సం సృష్టించాయి. అన్ని కోతులు గ్రామంలోకి ఒకేసారి రావడంతో జనాలు కాస్త భయందోళనకు గురయ్యారు. అయితే ఆ కోతులు ఇంతటితో ఆగలేదు. గ్రపూలుగా చేరి బాహుబలి రేంజ్ సైతం ఫైటింగ్ చేసుకున్నాయి. ఈ కోతుల ఫైటింగ్ చేస్తుండగా గ్రామంలోని కొందరు యువకులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలు కాస్త వైరల్ గా మారుతున్నాయి. బాహుబలి రేంజ్ లో జరిగిన ఈ కోతుల వార్ పై మీ అభిప్రాయాలన కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఎన్నో కలలు.. మరెన్నో ఆశలు.. కంటతడి పెట్టిస్తున్న యువతి మరణం!