దేశంలో వరుసగా రైలు ప్రమాాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఒడిశా రైలు ప్రమాదం ఘటన మరువక ముందే మరో ఘటన తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లాలో నెలకొంది.
దేశంలో వరుస రైలు ప్రమాదాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఒరిస్సా రైలు ప్రమాదంలో కొన్ని వందల ప్రాణాలు పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటన జరిగిన నాటి నుండి రైలు ప్రమాదాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. తాజాగా తెలంగాణలో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. తాజాగా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. షార్ట్‌సర్క్యూట్‌తో రైలులో మంటలు చెలరేగడంతో దట్టంగా పొగ అలుముకుంది. ఈ ప్రమాదంలో రెండు భోగీలు పూర్తిగా కాలిపోయాయి. అప్రమత్తమైన ప్రయాణికులు రైలులో నుండి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టు అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
యాదాద్రి జిల్లా బొమ్మాయిపల్లి – పగిడిపల్లి మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు భోగీల్లో నుండి దట్టమైన పొగలు వస్తున్నట్లు గమనించిన సిబ్బంది అప్రమత్తమై రైలుని నిలిపివేశారు.కాగా మిగతా భోగీలకు కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. ఇక రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఇప్పటికే సంఘటనా స్థలానికి బయల్దేరారు. ఈ ప్రమాదంలో ఎస్-3, ఎస్-4, ఎస్-5, ఎస్-6 భోగీలు ఇప్పటికే పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ హౌరా నుండి సికింద్రాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక.. ఈ ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఇక.. ఈ అగ్ని ప్రమాదంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.