ఈ మద్య కాలంలో మనిషి డబ్బు కోసం ఎలాంటి నీచమైన పనులకైనా సిద్దపడుతున్నారు. డబ్బు సంపాదించడానికి సొంతవాళ్లు, పరాయివాళ్లు అనే భేదం లేకుండా దారుణంగా మోసాలు చేస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కల్తీ వ్యాపారులు ఎక్కువ అయ్యారు. పాలు, నూనె, ఐస్ క్రీమ్, చాక్లెట్స్, కారం, పసుపు, అల్లం పేస్ట్ ఇలా వంటకు వాడే వాటిలో చాలా వరకు కల్తీ చేస్తున్నారు.
డబ్బు సంపాదన కోసం మనిషి దేనికైనా సిద్దపడుతున్నాడు. ఎదుటి వారి ప్రాణాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా తన స్వార్థం తానే చూసుకుంటున్నాడు. ఇక కాదేదీ కల్తీకి అనర్హం అన్న చందంగా ప్రతి దానిలో కల్తీ చేస్తున్నారు. నిత్యం మనం వినియోగించే ఆహార పదార్థాలన్నీ కల్తీయే. నూనె, పసుపు, అల్లం పేస్టు, కూరలో ఉపయోగించే మసాలాలు, ఇలా చెప్పుకుంటూ పోతే మనం తీసుకునే ప్రతి పదార్థం కల్తీ చేస్తున్నారు. కల్తీ వ్యాపారులపై అధికారులు దాడులు నిర్వహించి కేసులు పెడుతున్నా.. భారీ జరిమానాలు విధిస్తున్నప్పకీ కేటుగాళ్లు ఎక్కడో అక్కడ కల్తీకి పాల్పపడుతూనే ఉన్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద ఎత్తు కల్తీ పాల బాగోతం బయటపడింది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల కేటుగాళ్లు కల్తీ పాల వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. దీని వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దయసు వారికి ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కొంత మంది కల్తీ పాలు తాగి చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తెలంగాణలో కొన్ని చోట్ల కల్తీ వ్యాపారం ఎదేచ్ఛగా సాగుతుంది. తాజాగా కల్తీ పాలను తయారు చేసిన మార్కట్లో అమ్ముతున్న వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో పలు స్వీట్స్ షాపులకు, కిరాణా షాపులకు కల్తీ పాలు సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం రావడంతో మహేందర్ అనే పాల వ్యాపారిని అరెస్ట్ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ పాల కేంద్రాలపై ఎస్ఓటీ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లాలో ప్రధానంగా పోచంపల్లి, చౌటుప్పల్, బొమ్మలరామారం మండలాల్లో కాకుండా ఊరూరా యధేచ్ఛగా కల్తీ పాల దందా నడుపుతున్నట్లు గుర్తించారు. కల్తీ పాలను తయారుచేసే దుండగులను అదుపులోకి తీసుకున్నారు. కల్తీ పాల కోసం వినియోగించే వాహనాన్ని కూడా సీజ్ చేశారు. 80 లీటర్ల పాలలో 300 మి.లీ హైడ్రోజన్ పెరాక్సైడ్, 10 కేజీల దోల్ పూర్ పాలపౌడర్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మనం తాగే పాలలో 30 శాతం మాత్రమే పాలు ఉంటే మిగతా 70 శాతం కల్తీ రసాయనాలే. ఇప్పటికే రాచకొండ పోలీసులు దాడులు నిర్వహించి 11 కేసులు నమోదు చేశారు. 1500 లీటర్ల పాలను స్వాధీనం చేసుకున్నారు. పాల వ్యాపారి మహేందర్ ను కూడా అరెస్ట్ చేశారు.