ఈ మద్య ప్రపంచ వ్యాప్తంగా హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ తో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అకస్మాత్తుగా కన్నుమూస్తున్నారు. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా మనతో గడిపిన వారు గుండెపోటుతో ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు.
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటు మరణాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా హార్ట్ ఎటాక్ తో కన్నుమూస్తున్నారు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా గడిపిన వాళ్లు అకస్మాత్తుగా గుండెపోటుతో ఉన్నచోటే కుప్పకూలిపోవడం.. ఆస్పత్రికి తరలించేలోగా కన్నుమూయడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి కి చెందిన గూడురు మణికాంత్ రెడ్డి అనే తెలుగు విద్యార్థి ఫిలిప్సిన్స్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తాజాగా మణికాంత్ రెడ్డి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కీలక విషయాలు వెలువడ్డాయి. వివరాల్లోకి వెళితే..
భువనగిరి జిల్లా రామలింగంపల్లికి చెందిన గూడూరు మణికాంత్ రెడ్డి (21) వైద్య విద్యను అభ్యసించేందుకు ఇటీవల ఫిలిప్పిన్స్ కి వెళ్లారు. ఎప్పటికప్పుడు తల్లిదండ్రులతో క్షేమసమాచారాలు అడిగి తెలుసుకునేవాడు. శనివారం అర్థరాత్రి మణికాంత్ రెడ్డి అకస్మాత్తుగా కన్నుమూశాడు. అందరితో సంతోషంగా ఉండే మణికాంత్ ఒక్కసారే చనిపోయడన్న వార్త తెలియడంతో తల్లిండ్రులు షాక్ కి గురయ్యారు. అయితే మణికాంత్ మరణంపై రక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా, మణికాంత్ రెడ్డి మృతదేహానికి బుధవారం పోస్ట్ మార్టం నిర్వహించగా కార్డియాక్ అరెస్ట్ తో మృతి చెందినట్లుగా పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైంది. ఈ మేరకు అక్కడి అధికారుల నుంచి సమాచారం వచ్చిందని మృతుడి బంధువులు తెలిపారు.
తమ కొడుకు మణికాంత్ రెడ్డి ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడని.. తాను ఒక మంచి వైద్యుడిగా తిరిగి వచ్చి అందిరికీ సేవలు చేస్తానని చెప్పేవాడని.. అలాంటిది తమ కొడుకు కార్డియాక్ అరెస్ట్‌తోనే చనిపోవడం తీరని దుఖాఃన్ని మిగిల్చిందని కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు. అక్కడి అధికారులతో మాట్లాడి మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.. శుక్రవారం రాత్రికి మణికాంత్ రెడ్డి మృతదేహం హైబరాబాద్ కి రానున్నట్లు తెలుస్తుంది. మణికాంత్ ఆక్మసిక మరణంతో రామలింగంపల్లి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.