తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన తనయుడు కేటీఆర్ తెలంగాణ ఐటీ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఐటీ శాఖ మంత్రిగా ఆయన రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో అత్యున్నత స్థాయిలో సమ్మిట్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ వివిధ దేశాల్లో పారిశ్రామికవేత్తలను కలుస్తూ రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు పెట్టడానికి విశేష కృషి చేస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ అరుదైన ఘనత దక్కించుకున్నారు.
మంత్రి కేటీఆర్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటారు. తాజాగా ఆయన ప్రపంచంలోని టాప్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ లిస్టులో చోటు సంపాదించి సత్తా చాటారు. భారత దేశం నుంచి ఇద్దరు యువ నేతలు ఇన్‌ఫ్లూయెన్సర్స్ లిస్టులో చోటు సంపాదించడం ఎంతో గర్వకారణం అంటున్నారు నెటిజన్లు. ఒకరు తెలంగాణ మంత్రి కేటీఆర్ మరొకరు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చడ్డా. సోషల్ మీడియా టాప్ 30లో మంత్రి కేటీఆర్ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా 12, మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ఖాతా 22వ స్థానంలో నిలిచాయి. ఇక 23వ స్థానంలో రాఘవ్ చడ్డా నిలిచారు.
ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో దావోస్ లో కొనసాగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో ఇన్‌ఫ్లూయెన్సర్స్ లిస్టులో వెల్లడించారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో తనదైన శైలిలో స్పందిస్తుంటారు. తన పర్సనల్, అఫిషియల్ అకౌంట్స్ లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు కేటీఆర్. ట్విటర్ లో తమకు ఏదైనా సమస్య ఉందని తెలిపితే.. వెంటనే ఆ సమస్య పరిష్కరించేందుకు చైతనైన సహాయం చేస్తుంటారు. అటు రాజకీయాలపై కూడా యాక్టీవ్ గా స్పందిస్తుంటారు. ఈ క్రమంలో ప్రపంచంలో కేటీఆర్ ప్రపంచంలోనే 30 మంది టాప్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ లిస్టులో ఒకరిగా నిలిచి రికార్డు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటనలో ఉన్నారు. అభిమానులు, పార్టీ నేతలు, పారిశ్రామికవేత్తలు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.
Top 30 Influencers for the World Economic Forum @GretaThunberg@vanessa_vash@SumakHelena@wef@NazaninBoniadi@Davos@hedera@femalequotient@MarshMcLennan@Zurich@JimHarris@KTRTRS@WHO@Thomas_Binder@AveryDennison
via KCORE Analytics#WEF23 #WEF #Davos #socialmedia #smm pic.twitter.com/KB1rfiOr4Q
— Jim Harris #WEF23 (@JimHarris) January 16, 2023