రైల్వే స్టేషన్ లో రైల్ వస్తున్న సమయంలో ఫ్లాట్ ఫామ్ పై నిలబడటం.. కదులుతున్న ట్రైన్ ఎక్కడం, దిగడం లాంటివి చేస్తే ప్రాణాలకు ప్రమాదం మని ఎన్నిసార్లు రైల్వే అధికారులు చెబుతున్నా.. అలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం అవుతూనే ఉన్నాయి.
సాధారణంగా రైల్వే స్టేషన్ లో కొంతమంది త్వరగా గమ్యస్థానం చేరుకోవాలనే తొందరలో కదులుతున్న ట్రైన్ ఎక్కడం, దిగడం లాంటివి చేస్తుంటారు. ఆ సమయంలో పట్టుతప్పి ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్లు ఎంతోమంది ఉన్నారు. కొన్నిసార్లు స్టేషన్ లో రైల్వే పోలీసులు సమయస్ఫూర్తితో ధైర్యం చేసి ప్రాణాలు కాపాడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. రైలు సమీపంలో ఉండకూడదని.. కదులుతున్న ట్రైన్ ఎక్కడం.. దిగడం లాంటివి చేయకూడదని ఎన్నిసార్లు చెబుతున్నా అలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం అవుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్ లో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్ లలో కదులుతున్న ట్రైన్ ఎక్కే సమయంలో పట్టుతప్పి ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్ లో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.. అదే సమయంలో అక్కడ ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ చాకచక్యంగా యువతిని కాపాడింది. మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో లింగంపల్లి – ఫలక్ నూమా ఎక్స్ ప్రెస్ బేగం పేట రైల్వే స్టేషన్ కి వచ్చింది. ట్రైన్ కొద్దిసేపు ఆపి ముందుకు కదిలి వేగాన్ని పుంజుకుంది. అంతలోనే సరస్వతి అనే ప్రయాణికురాలు కదులుతున్న ట్రైన్ ఎక్కే ప్రయత్నం చేసి పట్టుతప్పిపోయింది. అదేసమయంలో అక్కడ డ్యూటీ చేస్తున్న సనిత ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆ మహిళను గుర్తించి పరిగెత్తుకెళ్లి ఆమెను వెనక్కి లాటి రక్షించింది.
ఆ సమయానికి కానిస్టేబుల్ రాకుంటే.. మహిళా ప్రయాణికురాలు ట్రైన్ కింద పడిపోయి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రయాణికులకు రైల్వే పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా.. గమ్యస్థానం త్వరగా చేరుకోవాలనే తొందరపాటుతో కదులుతున్న ట్రైన్ ఎక్కడం, దిగడం చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.. సమయానికి సనిత అనే మహిళా కానిస్టేబుల్ రాకపోయి ఉంటే.. సరస్వతి ప్రాణాలు పోయి ఉండేవి. ప్రయాణికురాలిని రక్షించడంపై అధికారులు, ప్రయాణికులు సనితను ప్రశంసిస్తున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన సనిత 2020 లో ఆర్పీఎఫ్ లో చేరి.. ప్రస్తుతం బేగంపేట్ రైల్వే స్టేషన్ లో విధులు నిర్వహిస్తుంది.