ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రమాదాల్లో సామాన్యులేకాదు ప్రముఖులు.. వారి బంధువులు కూడా చనిపోతున్నారు. టీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీపీ రెగట్టే మల్లికార్జున రెడ్డి కొడుకు దినేష్ రెడ్డి మంగళవారం రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయనకు నివాళులర్పించడానికి వచ్చిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమోషనల్ అయ్యారు.. కుటుంబ సభ్యులను ఓదార్చే సమయంలో కన్నీరు పెట్టుకున్నారు.
సీనియర్ టీఆర్ఎస్ నేత రెగట్టే మల్లికార్జున రెడ్డి కుమారుడు దినేష్ రెడ్డి శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు… అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమింగా గుర్తించారు. ఆరు నెలల కిందే దినేశ్‌కు పెళ్లి జరిగింది. చేతికందివచ్చిన కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. మల్లికార్జునరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి.. దినేష్ రెడ్డి మృతదేహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. దినేష్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న సమయంలో ఎమోషనల్ అయ్యారు… అప్రయత్నంగానే ఆయన కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. ఆ దు:ఖాన్ని దిగమింగుతూ ఆయన దినేష్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏకైక కుమారుడు ప్రతీక్ రెడ్డి కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతిచెందారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కన్నీరు పెట్టుకున్న దృశ్యానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.