ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు. పదిన్నర గంటలకు పైగా ఈడీ అధికారులు కవితను విచారించారు. మరోసారి ఈడీ విచారణకు హాజరుకావాలని కవితకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ అధికారులు దాదాపు పదిన్నర గంటలకు పైనే కవితను విచారించారు. డాక్యుమెంటేషన్, వాంగ్మూలంపై అధికారులు కవిత సంతకం తీసుకున్నారు. మరోవైపు తెలంగాణ అడిషనల్ డీజీ, న్యాయవాదులు భరత్, గండ్ర మోహన్ ఢిల్లీ ఈడీ కార్యాలయానికి వెళ్లారు. కవితకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు మహిళా డాక్టర్లు కూడా ఈడీ కార్యాలయానికి వెళ్లారు. కవితతో పాటు ఈడీ విచారణ ఎదుర్కొంటున్న పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యులు వెళ్లిపోయారు. ఏ క్షణంలో అయినా కవిత అరెస్ట్ ఉండచ్చునని ఊహాగానాలు వచ్చాయి. అయితే కవిత మద్దతుదారులు మాత్రం అరెస్ట్ లాంటివి ఏమీ ఉండవని ధీమా వ్యక్తం చేశారు.
కవిత అరెస్ట్ నేపథ్యంలో ఆందోళన జరిగే అవకాశం ఉన్నందున ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ నెల 11న విచారణకు హాజరైన కవిత రెండోసారి ఇవాళ హాజరయ్యారు. మొదటిసారి హాజరైన కవితను రాత్రి 8.05 గంటల వరకూ విచారించగా ఇవాళ రాత్రి 9 గంటల వరకూ విచారణ జరిపారు. దాదాపు 10 గంటల పాటు విచారణ సాగింది. ఉదయం రామచంద్ర పిళ్ళైతో కలిపి కవితను ఈడీ ప్రశ్నించింది. ఆ తర్వాత అమిత్ అరోరా, మనీష్ సిసోడియా, కవితను కలిపి ఈడీ ప్రశ్నించింది. దాదాపు పదిన్నర గంటల పైనే జరిగిన విచారణ ముగిసింది. రేపు ఉదయం 11 గంటలకు మళ్ళీ ఈడీ విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.