హైదరాబాద్‌కు మరో జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ మిషన్ కింద హైదరాబాద్ నగరం వాటర్ ప్లస్ హోదా పొందింది. ఈ మేరకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ నగర ప్రజలకు అభినందనలు తెలిపారు. ఇప్పటికే నగరానికి ఓడీఎఫ్(ODF) ప్లస్ ప్లస్ గుర్తింపు ఉందన్న కేటీఆర్ – నగరాన్ని ఇంకా పరిశుభ్రంగా, ఆకుపచ్చగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ట్వీట్ లో తెలిపారు.
బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత నగరాలకు ఓడీఎఫ్, బహిరంగ విసర్జకు జరిమానాలు విధించే నగరాలకు ఓడీఎఫ్ ప్లస్, మానవ విసర్జిత వ్యర్థాలను శాస్త్రీయంగా ట్రీట్‌మెంట్ చేసే సదుపాయాలుండటంతో పాటు ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు పంపించే సదుపాయాలున్న నగరాలకు ఓడీఎఫ్ డబుల్‌ప్లస్ నగరాలుగా గుర్తింపునిస్తారు. వాటర్ ప్లస్ హోదా రావాలంటే నదులు, కాలువలలో పరిశుభ్రతను నిర్వహించాలి. గృహాలు, వాణిజ్య సముదాయాల నుంచి విడుదలయ్యే మురుగు నీటిని శుద్ధి చేసిన తర్వాతే పర్యావరణంలోకి విడుదల చేయాలి. అలా చేస్తున్న నగరాలకు వాటర్ ప్లస్ హోదా లభిస్తోంది.
హైదరాబాద్ నగరం ఇప్పటికే ODF++ సిటీగా గుర్తింపు పొందింది. ఈ నగరాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా, పచ్చగా ఉంచేందుకు కృషి చేస్తామని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2021లో భాగంగా ఇండోర్ నగరం దేశంలోనే తొలి వాటర్ ప్లస్ నగరంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. స్వచ్ఛ సర్వేక్షన్ అనేది నగరాలు మరియు పట్టణాలలో పరిశుభ్రత, పరిశుభ్రత మరియు పారిశుద్ధ్యం యొక్క వార్షిక సర్వే. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Congratulations to the citizens of #Hyderabad on our city getting the coveted “Water plus” status of Swachh Bharat Mission from Govt of India
Hyderabad is already recognised as ODF++ city. We will continue to endeavour to make it cleaner & greener pic.twitter.com/0YKJ5uJHaj
— KTR (@KTRTRS) August 20, 2021